కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల భావోద్వేగ సందేశం.. కామెంట్లు పంపాలని వినతి..

|
Google Oneindia TeluguNews

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ 'నాలో.. నాతో.. వైఎస్సార్' పుస్తకంగా రచించడం, వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా గత వారం సీఎం జగన్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. విజయమ్మ రాసిన వైఎస్సార్ జీవిత చరిత్రకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడటం, దాదాపు అన్ని చోట్లా కాపీలు బాగా అమ్ముడుపోతున్న నేపథ్యంలో వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

#YSRForever : YSR 71వ జయంతి.. 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ఆవిష్కరించిన CM Jagan || Oneindia

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

''మదినిండా నాన్న జ్ఞాపకాలు.. 35ఏళ్ళ అనుభవాలకు పుస్తకరూపాన్నిస్తూ ప్రపంచానికి నాన్నను కొత్తగా పరిచయం చేసింది అమ్మ. తెలుగు పుస్తకాల అమ్మకాల్లో "నాలో నాతో వైఎస్సార్" సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఆనందంగా ఉంది. ఈ పుస్తకం పై మీ అందరి ఆలోచనలను సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశాల ద్వారా పంచుకోవాలని కోరుతున్నాను'' అని షర్మిల ట్వీట్ చేశారు.

YS Sharmila emotional tweet on Naalo Natho YSR Book, written by her mother

ఈనెల 8న 'నాలో నాతో వైఎస్సార్' విడుదల సందర్భంలో షర్మిల మాట్లాడుతూ.. నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన 'నాలో నాతో వైఎస్సార' మంచి పుస్తకమని, హృదయాన్ని తాకే విధంగా ఉందని, చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించిందని, నిజాలు చెప్పడం కష్టమే అయినప్పటికీ, విజయమ్మ ఆ పనిని ధైర్యంగా చేసిందని, వైఎస్సార్ స్ఫూర్తిమంతమైన వ్యక్తి కాబట్టే అమ్మ ఈ బుక్‌ రాసిందని చెప్పుకొచ్చారు.

English summary
‘‘We are honoured by your tremendous response to Amma's book 'Naalo Naatho YSR'. Do share your thoughts regarding the book in the comments below. Looking forward to reading your messages’’ says YS Sharmila in a tweet on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X