• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఒంటరిగా వైఎస్ షర్మిల: ఇడుపుల పాయలో తండ్రికి నివాళి: ఆ ప్రకటన తరువాత తొలిసారిగా

|

కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ప్రస్తుతం తన పుట్టిల్లు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. తన పినతండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, పినతల్లి సౌభాగమ్మ, చెల్లెలు సునీతతో కలిసి పులివెందులలోని వైఎస్ వివేకా ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తిరుమలకు వైఎస్ జగన్: ఆరునెలల్లో రెండోసారి: సీఎం చేతుల మీదుగా ఆ ఉత్సవం ప్రారంభంతిరుమలకు వైఎస్ జగన్: ఆరునెలల్లో రెండోసారి: సీఎం చేతుల మీదుగా ఆ ఉత్సవం ప్రారంభం

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

ఒంటరిగా ఇడుపుల పాయలో

ఒంటరిగా ఇడుపుల పాయలో

అనంతరం ఒంటరిగా ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్లారు. తన తండ్రి వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. నివాళి అర్పించారు. ఆ సమయంలో షర్మిల వెంట కొద్దిమంది అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కుటుంబ సభ్యులెవరూ ఆమె వెంట లేరని తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆమె ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ అరంగేట్రం తరువాత తొలిసారిగా..

రాజకీయ అరంగేట్రం తరువాత తొలిసారిగా..

ఇడుపుల పాయకు ఎప్పుడు వెళ్లినా కుటుంబ సభ్యులు తోడుగా ఉండేవారని, ఈ సారి దీనికి భిన్న పరిస్థితుల్లో వెళ్లారని తెలుస్తోంది. కాగా- తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మం వేదిక ఆమె తన రాజకీయ పార్టీ పేరు, జెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. అదే సమయంలో పాదయాత్రను కూడా ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ నివాసంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోన్నారు.

 పినతండ్రికి నివాళి అర్పించడానికి..

పినతండ్రికి నివాళి అర్పించడానికి..

పార్టీ విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినప్పటికీ- పినతండ్రి వర్ధంతి కావడం వల్ల పులివెందులకు వచ్చారు. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై మూడేళ్లవుతోంది. పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ హత్య కేసును ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

రాజకీయ దుమారానికి దారి తీసిన హత్యోదంతం..

రాజకీయ దుమారానికి దారి తీసిన హత్యోదంతం..

సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం.. రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇప్పటికీ.. వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఈ ఉదంతాన్ని తరచూ తెర మీదికి తెస్తూనే ఉంటారు. ఈ ఘటనపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రస్తుతం విచారణ సాగిస్తోంది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసుకున్న పిటీషన్ మేరకు ఏపీ హైకోర్టు.. ఈ హత్యోదంతంపై సమగ్ర విచారణ నిర్వహించాలంటూ సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

English summary
YS Sharmila visits Idupulapaya in Kadapa district on Monday and pays tributes to her father and late Chief Minister of Andhra Pradesh YS Raja Sekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X