కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ వివేకా హ‌త్యోదంతం: నిందితుల రిమాండ్ పొడిగింపు..పులివెందుల జైలుకు త‌ర‌లింపు!

|
Google Oneindia TeluguNews

కడప: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్యకేసులో నిందితుల రిమాండ్‌ను న్యాయ‌స్థానం మరోసారి పొడిగించింది. ఈ మేర‌కు సోమ‌వారం పోలీసుల‌కు అనుమ‌తి ఇచ్చింది. వైఎస్ వివేకా హ‌త్య‌కేసులో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్ర‌కాశ్ రెడ్డిల‌ను పోలీసులు ఇదివ‌ర‌కే అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వారి రిమాండ్ సోమ‌వారం నాటితో ముగిసింది.

దీనితో క‌డ‌ప కేంద్ర కారాగారంలో శిక్ష‌ను అనుభ‌విస్తోన్న ఈ ముగ్గురినీ పోలీసులు పులివెందుల న్యాయ‌స్థానం ఎదుట హాజ‌రు ప‌రిచారు. రిమాండ్‌ను పొడిగించాల‌ని పోలీసులు న్యాయ‌మూర్తికి విజ్ఞ‌ప్తి చేశారు. వారి అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన అనంత‌రం న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కిశోర్‌ కుమార్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 YS Viveka Murder row: Court gave permission to police extend remand to accused persons

కాగా- ప్ర‌స్తుతం క‌డ‌ప‌లోని కేంద్ర కారాగారంలో శిక్ష‌ను అనుభ‌విస్తోన్న ముగ్గురు నిందితులు పులివెందులలోని ఉప కేంద్ర కారాగారానికి త‌ర‌లించారు. క‌డ‌ప నుంచి పులివెందుల‌కు త‌ర‌లించాల‌ని నిందితులు త‌మ త‌ర‌ఫు వాదిస్తోన్న న్యాయ‌వాది ద్వారా న్యాయ‌స్థానానికి విజ్ఞ‌ప్తి చేశారు. దీన్ని ప‌రిశీలన‌లోకి తీసుకుంది. క‌డ‌ప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకు త‌ర‌లించ‌డానికి అనుమ‌తి ఇచ్చింది.

English summary
Pulivendula First Class District Magistrate Court gave permission to Police for extend remad to Three accused persons, who arrested in the Former Minister YS Vivekananda Reddy murder case. Magistrate gave permission to Police to shift Three accused persons from Kadapa Central Jail to Pulivendula Sub Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X