• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వివేకా హత్యకేసుపై వివేకా కుమార్తె సంచలనం.. ఇది కచ్చితంగా రాజకీయ హత్యే .. ఇంకెంతకాలం వేచి చూడాలి

|

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య జరిగి రెండేళ్ల అవుతోందని ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

జగన్ కు వైఎస్ వివేకా కుమార్తె షాక్ .. తండ్రి హత్యకేసులో సాయం కోసం 'సిస్టర్ అభయ కేసు' హక్కుల కార్యకర్తతో భేటీ జగన్ కు వైఎస్ వివేకా కుమార్తె షాక్ .. తండ్రి హత్యకేసులో సాయం కోసం 'సిస్టర్ అభయ కేసు' హక్కుల కార్యకర్తతో భేటీ

తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన

తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన

తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి వదిలేయ్ అని తనకు చాలా మంది సలహా ఇచ్చారని , కానీ తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సోదరుడని ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అని పేర్కొన్న సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని ఆరోపించారు.

 తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు

తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు

న్యాయం కోసం ఇంకెంత కాలం ఎదురు చూడాలని ఆమె నిలదీశారు . తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అధికారంలో ఉన్న తమకు న్యాయం జరగలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. తన తండ్రిది రాజకీయ హత్యే అని తేల్చి చెప్పారు. తాను సీబీఐ సీనియర్ అధికారిని కలిశానని , ఆ కలిసిన సమయంలో కడపలో ఇలాంటి ఘటనలు సాధారణమైన విషయం అని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. సిబిఐ అధికారులు సైతం ఇలా ఎలా మాట్లాడుతారు అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు .

కేసు విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరం జరిగినట్లే

కేసు విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరం జరిగినట్లే

తన తండ్రిని చంపిన దోషులను పట్టుకోకపోతే ఈ సంస్కృతి ఇలాగే పెరిగిపోతుందని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి చాలా సున్నితమైన మనసు కలవాడని పేర్కొన్న సునీతారెడ్డి కడప ప్రాంతానికి తన తండ్రి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరం జరిగినట్లేనని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు, వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది అని ఆమె తెలిపారు .

ఎంత కాలం వేచి చూడాలని ప్రశ్నిస్తున్న వివేకా కుమార్తె సునీతా రెడ్డి

ఎంత కాలం వేచి చూడాలని ప్రశ్నిస్తున్న వివేకా కుమార్తె సునీతా రెడ్డి


వైయస్ వివేకానంద రెడ్డిని 2019 ఎన్నికలకు ముందు మార్చి 15వ తేదీన ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే నాటి చంద్రబాబు ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తును సిటీ అప్పగించింది. ఆ సమయంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన సిట్ను రద్దుచేసి, జగన్మోహన్ రెడ్డి మరో సిట్ ను ఏర్పాటు చేశారు . ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సునీత కోర్టు మెట్లు ఎక్కారు. సిబిఐ అధికారులు రంగంలోకి దిగి వందలాది మందిని విచారించినప్పటికీ, పలువురిని నార్కోటిక్ పరీక్షలకు పంపినప్పటికీ ఇప్పటివరకు ఈ కేసులో దోషులు ఎవరో అంతు చిక్కలేదు. అందుకే ఎంతకాలం వేచి చూడాలని ప్రశ్నిస్తున్నారు సునీతా రెడ్డి .

English summary
YS Vivekananda Reddy's daughter Sunitha Reddy made interesting remarks on her father's murder case. Sunitha Reddy, has said that it has been two years since her father's murder and the accused have not been caught so far. Asked how long to wait for justice. Claimed to be threatening herself and said that it was definitely a political murder .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X