కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హత్య కేసులో ట్విస్ట్..సీల్డ్ కవర్‌లో జగన్ సర్కారు రిపోర్టు..సీబీఐ విచారణపై హైకోర్టులో టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతోపాటు ఇంకొందరు దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ ఎందుకు అవసరంలేదో కోర్టుకు ఆయన వివరించారు.

ఏజీ ఏమన్నారంటే..

ఏజీ ఏమన్నారంటే..

వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషనర్ల వాదనలు గత గురువారం(ఈనెల 13న) ముగిశాయి. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఏపీ పోలీసులు సాక్ష్యాలు సంపాదించలేకపోయారని, జగన్ సర్కారుపై నమ్మకంలేకే కేంద్ర సంస్థను కోరుతున్నామని వివేకా కుటుంబీకులు, టీడీపీ నేత బీటెక్‌ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లలో వాదించారు. దానికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం ఇవాళ (20న)వాదనలు వినిపించింది. వివేకా కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే సాగుతున్నదని, ఇప్పటికే చాలా పురోగతి సాధించారని, అలాంటప్పుడు సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాల్సిన అవసరమే లేదని ఏజీ శ్రీరామ్ అన్నారు.

రిపోర్టు సమర్పణ..

రిపోర్టు సమర్పణ..

వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు సాధించిన పురోగతి, సంపాదించిన ఆధారాలు, ముంన్ముందు ఏం చెయ్యబోది సమగ్రంగా వివరిస్తూ ప్రభుత్వం ఒక రిపోర్టను తయారు చేసింది. సీల్డ్ కవర్ లో దాచిన ఆ రిపోర్టను సుబ్రమణ్య శ్రీరామ్‌.. హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావుకు అందజేశారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దంటున్నామో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నామని ఏజీ తెలిపారు. రిపోర్టును స్వీకరించిన హైకోర్టు.. కేసు విచారణను సోమవారానికి(ఈనెల 24కు) వాయిదా వేసింది.

తీర్పుపై టెన్షన్..

తీర్పుపై టెన్షన్..

వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలనే అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగియడం, దర్యాప్తు రిపోర్టును ప్రభుత్వం అందజేసిన నేపథ్యంలో వచ్చేవాయిదా(సోమవారం)రోజే జడ్జి తీర్పు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి గురువారం నడుస్తోన్న విచారణను జడ్జి ముందుకు(సోమవారానికి) జరపడంతో అందరిలోనూ టెన్షన్ పెరిగింది.

అనేక మలుపులు..

అనేక మలుపులు..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు(మార్చి 14న) వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేసినవాళ్లలో వైఎస్ జగన్ కూడా ఉన్నారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఆ సందర్భంలో ‘‘కేసును సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటి?''అని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివేకా కుటుంబీకులు, టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం సీబీఐ ఎంక్వైరీకే పట్టుపట్టడంతో విచారణ కొనసాగుతోంది. వివేకా హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్న వ్యక్తుల్లో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మరో 14 మంది ఉన్నారు.

English summary
YS Vivekananda reddy murder case: andhra pradesh government submits investigation report in a sealed cover to high court on thursday. Advocate general says, there is no need of cbi enquiry in this matter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X