కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌డ‌ప పెద్ద ద‌ర్గాలో రంజాన్ ప్రార్థ‌నాల్లో వైఎస్ జ‌గ‌న్‌

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రగిరి కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు ! || Oneindia Telugu Telugu

కడప: మూడురోజుల పాటు త‌న స్వ‌స్థ‌లం పులివెందుల‌లో ప‌ర్య‌టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. గురువారం సాయంత్రం క‌డ‌ప‌లోని అమీన్‌పీర్ ద‌ర్గాను సంద‌ర్శించారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన క‌డ‌ప ఎమ్మెల్యే అమ్జాద్ భాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని ద‌ర్గాలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ముందుగా పీర్‌-ఉల్లా-మాలిక్‌ మజార్‌ను సందర్శించారు. పూల చాదర్‌ సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు.

అదే ప్రాంగ‌ణంలో ఉన్న ఇత‌ర మజార్ల‌ను సందర్శించి పూలచాదర్‌ సమర్పించారు.ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జగన్ కు అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆశీస్సులు అందజేశారు. పులివెందుల నియోజకవర్గ పర్యటన సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జా ద‌ర్బార్ వ‌ల్ల వైఎస్ జగన్ తీరిక లేకుండా గ‌డిపిన విష‌యం తెలిసిందే.

YSRCP President YS Jagan visited Ameenpeer Dargah at Kadapa

హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైన ఆయ‌న అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. వైఎస్ జ‌గ‌న్‌ను చూడ‌టానికి స్థానికులు పెద్ద సంఖ్య‌లో ద‌ర్గా వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న‌తో సెల్ఫీలు తీసుకోవ‌డానికి పోటీ ప‌డ్డారు.

YSRCP President YS Jagan visited Ameenpeer Dargah at Kadapa
English summary
In the month of Ramadan, YSR Congress Party President YS Jagan Mohan Reddy visited Ameenpeer Dargah at Kadapa, Knowingly as Pedda Dargah. In this Connection, He perform a Prayers in that Mosque and submitted a Flower Chadar to Mosque.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X