కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ కరీంనగర్: 100 శాతం వ్యాక్సినేషన్‌తో రికార్డు, బెంగళూరు అర్బన్ తర్వాతి ప్లేస్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరిని టీకాతోనే ఎదుర్కొగలం.. దాంతోపాటు మాస్క్, ఫిజికల్ డిస్టన్స్ మ్యాండెటరీ.. తొలుత టీకా గురించి అవగాహన లేక వేసుకునేందుకు జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ దానితోనే నివారించగలం అని తెలియడంతో క్యూ లైన్‌లో ఉండి మరీ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆల్ మోస్ట్ ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండో డోసు కూడా ఇంపార్టెంట్ కావడంతో.. సిబ్బంది ఉరుకులు పరుగులు తీసి.. సమయం పూర్తయినా వారికి ఇచ్చారు. అలా తెలంగాణలో గల కరీంనగర్ జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యింది.

Recommended Video

COVID 19 Vaccination: Centre's New Rule Including Precaution Dose | Oneindia Telugu
 కరీంనగర్ రికార్డు

కరీంనగర్ రికార్డు

వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. నిన్నటి వరకు జిల్లాలో రెండో డోసు పంపిణీ వంద శాతం పూర్తయింది. రాష్ట్రంలో రెండు డోసులు వంద శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో 7 లక్షల 92 వేల 922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా..మొదటి డోసు లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8లక్షల 27 వేల 103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో సెకండ్‌ డోసు అందజేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ సిటీ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాత కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది.

100 శాతం వ్యాక్సినేషన్

100 శాతం వ్యాక్సినేషన్

వంద శాతం వ్యాక్సినేషన్ రికార్డ్ సృష్టించడంపై మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. మొదటి డోసు విషయంలో తెలంగాణ ఇప్పటికే వంద శాతం లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాల వారీగా పరిశీలించగా..నిజామాబాద్‌, సూర్యాపేట, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో టార్గెట్‌ పూర్తయితే అన్ని జిల్లాలు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం చేసుకుంటాయి.

లక్ష్యం కన్నా ఎక్కువే..

లక్ష్యం కన్నా ఎక్కువే..

రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన వారికి 2 కోట్ల 77 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం ఆదేశించగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోసు 2 కోట్ల 88 లక్షల మందికి వేశారు.మరోవైపు జనవరి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందనే వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
100 percent second dose vaccination completed at karimnagar district. health minister harish rao praised officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X