• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

7 వేల మంది రైతులు చచ్చిన చీమకుట్టినట్టయిన లేదు: షర్మిల ఫైర్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విరుచుకుపడుతున్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆమె పర్యటించారు. గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామం, ఇల్లందకుంట మండలం జావరిపేటలో ఆమె పర్యటన కొనసాగింది. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని షర్మిల మండిపడ్డారు. ఏడేళ్లలో 7 వేల మంది రైతులు చనిపోయారని ఆమె వివరించారు. రైతు ఆవేదన సభ మూడోరోజు సిరిసిల్లలో జరిగింది. 70 రోజుల్లోనే 200 మంది చనిపోయారని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని చెప్పారు. కేసీఆర్ చేతగానితనం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వివరించారు. యాసంగిలో వరి పంట కొనమని చెప్పడం ఏంటీ అని అడిగారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. ధాన్యం కొనకుంటే ముఖ్యమంత్రి ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు రైతుల గోస పట్టదని వివరించారు. అందుకే రైతు వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటున్నాయని వివరించారు.

అప్పులు కావడంతో..

అప్పులు కావడంతో..

రైతు రాగుల దేవయ్య అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల వివరించారు. కేటీఆర్ నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే పక్క నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగుల దేవయ్య రెండు సార్లు బోర్లు వేసి నీళ్లు రాకపోవడంతో అప్పులుకట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కేటీఆర్, కేసీఆర్ ఇన్నేండ్లుగా అధికారంలో ఉండి రైతులకు చేసిందేమీ లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకుల్లో కొత్త రుణాలు రైతులకు రాకపోవడంతో బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. అలా చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

పింఛన్ మాత్రం ఇవ్వరట..?

పింఛన్ మాత్రం ఇవ్వరట..?

వృద్దులకు పింఛన్ కూడా ఇప్పించలేని టీఆర్ఎస్ నాయకులు మంత్రులం, ఎమ్మెల్యేం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని కామెంట్ చేశారు. ముమ్మాటికీ టీఆర్ఎస్ రైతు వ్యతిరేఖ ప్రభుత్వం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేని సీఎం కేసీఆర్ అవసరం లేదు. వడ్లు కొనడం చేతకాక కేసీఆర్ ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారు. పరిపాలన చేయడం చేతకాక కేసీఆర్ చావుడప్పు కొడుతున్నారు. రైతు వ్యతిరేకి కేసీఆర్ అధికారానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులంతా కలిసి చావుడప్పు కొట్టాలి. ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో అందరికీ రూ.25 లక్షల రూపాయలు కేసీఆర్ బాధ్యతగా చెల్లించాలి. మద్దతు ధర ఉన్న పంటల్లో ఒక పంట వరి. మద్దతు ధర అంటే రైతులు వేసిన పంటను ప్రభుత్వం భరోసాను కల్పించి కొనుగోలు చేయాలి. వరి వేయవద్దన్నారంటే రైతు నుంచి భరోసాను కేసీఆర్ లాక్కున్నట్టే. మద్దతు ధర ఉన్న పంటను పండించడం రైతు హక్కు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ, పేద కుటుంబంలో పుట్టిన బిడ్డలు పెద్ద చదువులు చదవాలని ఫీజు రియాంబర్స్ మెంట్ తీసుకువచ్చిన మహానేత వైయస్ఆర్ గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి పనిచేయాలి. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ధర ఇవ్వకపోగా తాలు, తరుగు, హమాలీ బిల్లు, మిల్లర్ల కట్టింగ్ పేరుతో రైతులు పండించిన పంటను ఆగం చేస్తున్నారు.

రైతులపై భారమా..?

రైతులపై భారమా..?


వరి పంట కొనం అని చెప్పే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. వడ్లు పండించడం వరకే రైతు బాధ్యత. పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పండించిన వడ్లను రా రైస్ చేసుకుంటారా.., బాయిల్డ్ రైస్ చేసుకుంటారా లేక బంగారం చేసుకుంటారా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలి. పండించిన వడ్లను ఢిల్లీలో అమ్ముకుంటారా.., మన దేశంలో అమ్ముకుంటారా లేక ఇతర దేశాలకు అమ్ముకుంటారా అన్నది కేసీఆర్ పాలనపై ఆదారపడి ఉంటుంది. కానీ రైతులపై ఆ భారాన్ని మోపడమేంటి..? కేసీఆర్‌కు వరి కొనుగోలు చేయడం చేతగాక రైతులపై భారాన్ని మోపుతున్నారు. వరి వద్దనడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులవి ఆత్మహత్యలు కావు...కేసీఆర్ చేస్తున్న హత్యలే. గ్రామాల్లో ఒక్క రైతును కూడా టీఆర్ఎస్ నాయకులు పరామర్శించింది లేదు. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు మూడు రోజుల్లో అందజేస్తామని కేసీఆర్ అంటున్నారు. మరి మన రైతులవి ప్రాణాలు కాదా..? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

వరి పంట వేయొద్దని చెప్పేందుకు కేసీఆర్ ఎవరు..? || Oneindia Telugu
ప్రగతిభవన్‌లో భోగాలు

ప్రగతిభవన్‌లో భోగాలు

కేసీఆర్‌కు కావాల్సింది ప్రగతి భవన్ లో బోగాలు అనుభవించడమే. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు బురద నేలల్లో వరి తప్ప ఇంకే పంటా పండదని తెలియదా..? వరి వేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖలో సంతకం ఎలా చేశారు..? తెలంగాణ రైతులు వరి వేయబోరని చెప్పడానికి మీరెవరు..? వరి పంట కొనం అనిచెప్పే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. వడ్లు పండించడం వరకే రైతు బాధ్యత. పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పండించిన వడ్లను రా రైస్ చేసుకుంటారా.., బాయిల్డ్ రైస్ చేసుకుంటారా లేక బంగారం చేసుకుంటారా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలి. పండించిన వడ్లను ఢిల్లీలో అమ్ముకుంటారా.., మన దేశంలో అమ్ముకుంటారా లేక ఇతర దేశాలకు అమ్ముకుంటారా అన్నది కేసీఆర్ పనితనంపై ఆదారపడి ఉంటుంది. కానీ రైతులపై ఆ భారాన్ని మోపడమేంటి..? కేసీఆర్ కు వరి కొనుగోలు చేయడం చేతగాక రైతులపై భారాన్ని మోపుతున్నారు. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. రైతు వ్యతిరేకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనికిరాడు. రైతు కష్టపడి పండించిన వరి పంటను కొనుగోలు చేయలేని టీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరం లేదని షర్మిల విమర్శించారు.

English summary
7 thousand farmers are suicide in seven years ysrtp chief ys sharmila alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X