కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ లో బావిలో పడ్డ కారు.. ఐదుగురు గల్లంతు, రంగంలో రెస్క్యూ టీమ్

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక కారు వ్యవసాయ బావిలో పడిపోయింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా కారు చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద అదుపుతప్పి బావి లోకి దూసుకు వెళ్ళింది. అయితే కారులో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు ఉన్నారని స్థానికులు భావిస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రానికి పనిమీద వెళ్ళిన రైతు కారు బావిలో మునిగిపోవడాన్ని గమనించి ఇరుగు పొరుగు రైతులను పిలిచాడు. కారు వ్యవసాయ బావి లోకి దూసుకుపోవడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును వెలికి తీసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కారు బావిలో పడడంతోనే అది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో ఉన్నవారు కూడా నీటిలో మునిగిపోయారు. అందరూ చూస్తుండగానే కారు జల సమాధి అయింది.

A car fell into a well in Karimnagar .. Five members missing, rescue team in the field

వర్షాకాలం కావడంతో బావిలో ఫుల్లుగా నీరు ఉన్న కారణంగా 20 అడుగుల కంటే ఎక్కువ లోతులోనే కారు పడినట్లుగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లు రెస్క్యూ సిబ్బందితో బావిలో పడిన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో కారులో ఎంతమంది ఉన్నారు? వారు సురక్షితంగా బయట పడతారా లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

English summary
The accident took place in the village of chinna Mulkanur in the joint Karimnagar district. A car accidentally fell into a farm well. On the way from Karimnagar to Husnabad, the car derailed at Chinna Mulkanur in Chigurumadi zone and plunged into a well. However, locals believe there were five people in the car at the time of the accident. Excessive speed is known to cause a car to fall into a well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X