రామగుండంలో మరోసారి అమ్మోనియా గ్యాస్ లీక్.. అరగంట పాటు జనం ఇబ్బందులు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి రాత్రి 10.30 గంటలకు వరకు లీకేజీ కొనసాగింది. ఆ గ్యాస్ సమీపంలో గల గోదావరి ఖని.. సహా వివిద ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు కళ్లకు మంటలు రావడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అయితే వారం రోజుల కింద ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటన జరిగింది. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పుడు డైవర్టర్ ట్రిప్ కావడంతో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. శుక్రవారం రాత్రి కూడా లీకయ్యింది. అయితే అరగంట తర్వాత.. అంటే రాత్రి 10.30 గంటలకు వాసన తగ్గిపోయింది. దీంతో సమీపంలో గల ప్రజలు రిలాక్స్ అయ్యారు. ప్రతీసారి ఇలా గ్యాస్ లీక్ కావడంతో.. తమకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.

Comments
English summary
ammonia gas leaked at ramagundam, fertilizer factory. local people are feared.