• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?

|

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముహుర్తం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉత్తప్రదేశ్ లోని అయోధ్య నగరంలో రామజన్మభూమిగా భావిస్తోన్న ప్రదేశంలో రూ.500 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 5న ఉదయం 11:30కు భూమి పూజ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతితిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేస్థారు. అయితే, ప్రధాని హోదాలో మోదీ హాజరుపైఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య కామెంట్లు చేశారు. వాటికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా కౌంటరిచ్చారు.

అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..

అసద్ ఏమన్నారంటే..

అసద్ ఏమన్నారంటే..

అయోధ్య భూమి పూజకు మోదీ వెళతారంటూ ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ పలు జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇటర్వ్యూల్లో ఘాటు కామెంట్లు చేశారు. మంగళవారం తన అధికారిక ట్విటర్ లోనూ అవే అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్య భూమి పూజలో పాల్గొంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని, మన రాజ్యాంగం లౌకికవాద పునాదులపై ఏర్పడిందని, ఒక మతానికి ప్రతినిధిలా ప్రధాని వ్యవహరించడం తగదని, ఆగస్టు 5న అయోధ్యలో జరిగే భూమి పూజకు మోదీ వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్లాలని అసద్ వ్యాఖ్యానించారు.

అమెరికా ఆగమాగం: మళ్లీ రికార్డు మరణాలు-మాస్క్ వద్దంటూ ట్రంప్ కిరికిరి-అన్ని దేశాలకు వ్యాక్సిన్ సప్లై

ఓవైసీది చవకబారు వాదన..

ఓవైసీది చవకబారు వాదన..

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అయోధ్య భూమిపూజకు వెళ్లరాదంటూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలు చవకబారుగా ఉన్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రధానిపై ఓవైసీ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భూమి పూజకు మోదీ ప్రధాని హోదాలోనే హాజరవుతారని, అది చారిత్రక అవసరం కూడా అని సంజయ్ స్పష్టం చేశారు.

అదే నిజమైతే కూల్చిందెవరు?

అదే నిజమైతే కూల్చిందెవరు?

అయోధ్యలో వందల ఏళ్లుగా కొనసాగుతోన్న మసీదులో.. 1949, డిసెంబర్ 22, 23 తేదీల్లో రాత్రికి రాత్రి విగ్రహాలు ప్రతిష్టించడం ద్వారా ఆ స్థలాన్ని వివాదంలోకి నెట్టేశారని, 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరగకపోతే, తాజా సుప్రీంకోర్టు తీర్పు మందిరానికి అనుకూలంగా వచ్చేదే కాదని, ముస్లింలు ఆ చోటును ఎప్పటికీ మసీదుగానే భావిస్తారని, ఆరాధన స్థలాల చట్టాన్ని మంటగలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అసద్ మంగళవారం నాటి ఇంటర్వ్యూల్లో పేర్కొనగా.. ‘‘400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉందనడం నిజమైతే, మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు?''అని సంజయ్ ఎదురు ప్రశ్నించారు.

ఇది భారతీయుల ఆలయం..

ఇది భారతీయుల ఆలయం..

‘‘సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, ఎలాంటి సమస్యలు లేకుండా, అందరి ఆమోదంతో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. దేశ ప్రధానిగా, హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోదీ అయోధ్య భూమి పూజలో పాల్గొనడం చారిత్రాత్మక అవసరం. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందినదే కాదు, ఇది భారతీయుల ఆలయం''అని సంజయ్ వ్యాఖ్యానించారు.

అయోధ్యకు రావొద్దు.. టీవీల్లోనే..

అయోధ్యకు రావొద్దు.. టీవీల్లోనే..

భూమి పూజ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దేశం నలుమూలల నుంచి పదుల సంఖ్యలో రామభక్తులు ఇప్పటికే కాలినడకన అయోధ్యకు బలుదేరారు. వారిలో ముస్లింలు కూడా ఉన్నారు. కొవిడ్ నేపథ్యంలో కొద్ది మందితో మాత్రమే భూమి పూజ నిర్వహిస్తున్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యూపీలోని ఇతర ప్రాంతాలు, ఢిల్లీ, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు రావొచ్చన్న సమాచారం మేరకు ఆలయ ట్రస్టు బుధవారం కీలక ప్రకటన చేసింది. అయోధ్యకు ఎవరూ రావొద్దని, అందరూ ఇళ్లలోనే ఉండి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూడాలని ట్రస్టు ముఖ్యులు సూచించారు. భూమి పూజ నేపథ్యంలో అయోధ్య అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

English summary
telangana bjp state president bandi sanjay kumar slams aimim chief asaduddin owaisi for saying PM Modi’s Ayodya bhoomi puja will be violation of constitution. sanjay says pm modi attendance at ayodhya is a historical need
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X