కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులు అంటే చులకన.. పైగా హామీలు: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్‌కు సంబంధించి చివరి రోజు కూడా మాటల తుటాలు పేలాయి. మంత్రి హరీశ్ రావు మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. గోబెల్స్ ప్రచారంతో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లలో తెలంగాణకు ఏంచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూడడం బీజేపీ నైజం అని హరీశ్ రావు విమర్శించారు. నిరసనలు తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారుతో దూసుకెళ్లి వారి మరణానికి కారకుడయ్యాడని, అతడిపై ఇప్పటికీ చర్యలు లేవని ఆరోపించారు. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర ఎవరిది? బీజేపీది కాదా? అని ప్రశ్నించారు.

bjp has look farmers cheap minister harish rao alleges

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

Recommended Video

Huzurabad Election : TRS, BJP కలిసి పనిచేస్తున్నాయి.. ఇవే కారణాలు!!

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
bjp has look farmers cheap minister harish rao alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X