కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గడ్డి పోస కాదు గడ్డపార: కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఈటల రాజేందర్ ప్రజా జీవన పాదయాత్ర కొనసాగుతోంది. జనంతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. సమయం దొరికితే చాలు సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌కు దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. బై పోల్ నేపథ్యంలో దళిత బంధు తీసుకొచ్చారని ఆరోపించారు. ఇంతకుముందు కూడా దళితుల అభ్యున్నత కోసం ఆలోచిస్తే బాగుండేదని సూచించారు.

తనను గడ్డి పోస అనుకున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. కానీ వారికి గడ్డ పార అయి గునపం దింపేలా మారనని వివరించారు. వారికి అర్థం కావడంతో తనను మెల్లగా దూరం పెట్టానని చెప్పారు. ఐదేళ్లు ఆత్మ క్షోభ ఉందని.. చివరికీ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. తన బాధ హుజురాబాద్ ప్రజలకు తెలుసు అని చెప్పారు. కేసీఆర్ చెబుతున్న దళిత బంధును ఆ సామాజిక వర్గానికి చెందిన మేధావులు కూడా విశ్వసించడం లేదన్నారు.

bjp leader etela rajender slams cm kcr

కేసీఆర్ అహంకారం, నిరంకుశత్వం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. తనను దమ్ముంటే రాజీనామా చేయాలని కేసీఆర్ బానిసలు అడిగారని గుర్తుచేశారు. అందుకే రాజీనామా చేశానని చెప్పారు. బై పోల్‌లో విజయం తనదేనని స్పష్టంచేశారు.

Recommended Video

Huzurabad Election Candidates |Etela Rajender | TRS VS BJP VS CNG | Oneindia Telugu

నియోజకవర్గంలో గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ నియోజకవర్గంలో గల ప్రజల ముందుకు వచ్చారు.

English summary
bjp leader etela rajender slams cm kcr on dalitha bandhu and various issues. before he forget dalit community etela alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X