కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూ

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ జిల్లా బీజేపీలో.. కీలక నేతలు కొందరు.. పార్టీలోని మహిళా కార్యకర్తలతో రాసలీలలు సాగిస్తున్నారనే అంశంపై దుమారం కొనసాగుతున్నది. ఓ మహిళా కార్యకర్త ఇంట్లో నగ్నంగా దొరికిపోయిన బాస సత్యనారాయణను జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించగా, ఆ వ్యవహారంపై బాధిత మహిళ మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ఉదంతంలో పోలీస్ ఉన్నతాదికారులు డీల్ కుదిర్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై కరీంనగర్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది..

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

బొట్టు పెట్టి రెండో భార్యవన్నాడు..

బొట్టు పెట్టి రెండో భార్యవన్నాడు..

రాసలీలల వీడియో, బెదిరింపు ఆడియోలు బయట పడటంతో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోల్పోయిన బాస సత్యనారాయణ గురించి సదరు మహిళ సంచలన వ్యాఖ్యలతో తాజాగా మరో వీడియో విడుదల చేశారు. బాస సత్యనారాయణ బొట్టు పెట్టి చిన్న భార్యగా స్వీకరించాడని, అందుకే ఏడాది కాలంగా అతనితో సహజీవనం చేస్తున్నానని ఆ మహిళ చెప్పుకొచ్చారు. అయితే రాసలీలల వీడియోను తనకు తెలియకుండా ఎవరో కావాలని బయటపెట్టారని, ఈ విషయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు.

వ్యభిచారం చేస్తున్నానని సంతకాలు..

వ్యభిచారం చేస్తున్నానని సంతకాలు..

‘‘తనకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ బాస సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నన్ను జులై 12న స్టేషన్ కు పిలిపించగా.. రెండో భార్యగా స్వీకరించినందుకే సహజీవనం చేస్తున్నానని చెప్పాను. కానీ 70 ఏళ్ళ ముసలాయనతో ఎలా సహజీవనం చేస్తున్నావని, డబ్బుల కోసమే వ్యభిచారం చేస్తున్నావని పేపర్ల మీద సంతకాలు తీసుకుని, నానా రకాలుగా హింసిస్తున్నారు. వీడియోలు నేను లీక్ చేయలేదని చెప్పినా, నా ఫోన్‌ లాక్కొని ఫార్మాట్ చేశారు. ఏసీపీ దగ్గరకు వెళితే రూ.5లక్షలు ఇస్తాం, వేరే ఫోన్‌ కొనిస్తాం అని చెప్పారు'' అని సదరు మహిళ చెప్పారు. లీకైన ఆడియో, వీడియో టేపులతోపాటు కొన్ని చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలాబీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలా

ఇంకొందరు నేతలదీ ఇదే తీరు..

ఇంకొందరు నేతలదీ ఇదే తీరు..

బాస సత్యనారాయణతో సహజీవనం చేశానని చెప్పిన బీజేపీ మహిళా కార్యకర్త.. తన ఇంట్లో మరో ఇద్దరు బీజేపీ నాయకురాళ్ళు, మరో నాయకుడితో కలిసి అసభ్యకరమైన పని చేశారని వెల్లడించారు. తన ఇంట్లో ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే, పదవుల కోసం ఇలాంటివి తప్పవని, బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారని ఆ మహిళ పేర్కొన్నారు. సహజీవనం, వీడియోల వివాదాన్ని తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన పట్టించుకోలేదని, తనకు బీజేపీ నాయకుల నుంచి ప్రాణభయం ఉందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

AP Rains Alert మరో రెండు రోజులు భారీ వర్షాలు, గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం | Oneindia Telugu
కమిషనర్ ఆరా.. ఢిల్లీలో బండి..

కమిషనర్ ఆరా.. ఢిల్లీలో బండి..

బీజేపీ నేత రాసలీలల వ్యవహారంలో బాధిత మహిళ నోరు మూయించేలా ఆర్థికపరమైన సెటిల్‌మెంట్లలో పోలీసుల ప్రమేయం ఉందని ఆడియోల్లో బయటపడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీనిపై కరీంనగర్ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఓ ఏసీపీ, సీఐలు వినిపిస్తుండటంతో వారు ప్రైవేటు వ్యవహారంలో తలదూర్చినట్లు మహిళ చెప్పిన మాటల్లో నిజమెంత?, ఒకవేళ అదే నిజమైతే ఎందుకిలా చేశారనే దానిపై సీపీ వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు తన సొంత జిల్లా కరీంనగర్‌లో చోటు చేసుకున్న పరిణామాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఢిల్లీ నుంచే సమీక్షిస్తున్నారు. ఇప్పటికే బాస సత్యనారాయణను పదవి నుంచి తొలగించిన బండి.. పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు.

English summary
Another twist has taken place in illicit affair of former BJP karimnagar district president Basa Satyanarayana, The woman activist who leaked the video and audios made some more sensational comments. She said she was in relation with Satyanarayana because he adopted her as a second wife. The woman said she feared for her life from BJP leaders and asked BJP state president Bandi Sanjay to do justice in the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X