కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో : అతివేగం టాప్ ఎక్కించింది.. రేకుల షెడ్డుపైకి.. గాల్లో తేలిన కారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అతివేగంతో రేకుల షెడ్డు పైకి ఎక్కినా కారు ( వీడియో )

కరీంనగర్ : రోడ్డుపై దూసుకెళ్లాల్సిన కారు రేకుల షెడ్డు ఎక్కింది. అతివేగంతో కారు నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్డుపైకి దూసుకెళ్లింది. జిల్లాలోని గుండ్లపల్లి స్టేజీ దగ్గర చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న కారు సడెన్‌గా అదుపుతప్పింది. అతివేగంతో దూసుకెళుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న రేకుల షెడ్డుపైకి ఎక్కింది. అలా చాలాసేపు గాల్లో తేలుతూ ఉండిపోయింది. కారులో ప్రయాణిస్తున్నవారు కూడా కిందకు దిగలేని పరిస్థితి. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సహాయకచర్యలు కాస్తా ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!వామ్మో.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న కారు రాజీవ్ రహదారిపై అదుపుతప్పింది. అతివేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. అలా రోడ్డుపక్కన ఖాళీ షెడ్డుపైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న నర్సింగ్ భూషణ్, స్వరూప, విజయకు తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున కావడంతో ఆ షెడ్డులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. అదే క్రమంలో పోలీసులకు కూడా కాస్తా ఆలస్యంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దాంతో సహాయకచర్యలు కాస్తా లేట్ అయినట్లు సమాచారం.

car speed does not control then went to top on shed in karimnagar

చివరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఉన్నది ఉన్నట్లుగా కారును అలాగే కిందకు దించారు. క్రేన్ సహాయంతో కారును కిందకు దింపారు. అయితే అప్పటివరకు కారులో ఉన్నవారు అలాగే పైన గాల్లో వేలాడుతూ కనిపించారు. అటు కారు డోర్లు తీయలేక.. వారిని కిందకు దించలేక స్థానికులు కూడా ఏం చేయలేకపోయారు. అదలావుంటే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

English summary
The car was speeding and crashed into a roadside shed. The incident near the Gundlapalli Stage in Karimnagar district has gone viral on social media. The car that was traveling on Rajiv Gandhi National Highway was detained as a sudden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X