కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లి నిర్లక్ష్యం, తండ్రి ఏమరుపాటు .. చిన్నారి మృతి

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ : పేగుతెంచుకొని పుట్టిన ప్రాణం బిడ్డ కళ్ల ముందే పోతే ఆ పరిస్థితి తలచుకోవడానికే ఒళ్లు జలదరిస్తోంది. మరి ఆ పసి ప్రాణం పోవడానికి కూడా తల్లిదండ్రులే కారణమైతే .. ఆ పరిస్థితి వర్ణణాతీతం. ఆ పసి మనసును తలచుకొని .. వారికి క్షణమొక యుగమే. అలాంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఓ తల్లిదండ్రులకు ఎదురైంది.

రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

చిన్నారి మృతి ..
కరీంనగర్ మండలం చెర్లబూత్కూరు గ్రామానికి చెందిన జక్కుప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి రితిన అనే మూడేళ్ల పాప ఉంది. అయితే ప్రసాద్‌కు ట్రాక్టర్ ఉంది. దాంతో తన సొంత వ్యవసాయ పనులు చేసుకుంటాడు. అయితే ఎప్పటిలాగే సోమవారం కూడా ట్రాక్టర్ తీస్తుండగా తమ కూతురే చక్కాల కింద నలిగి మృత్యువాత పడింది. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

child dead at tracktor accident

ట్రాక్టర్ రూపంలో ..
తమ ఇంటిముందు ఉన్న ట్రాక్టర్‌ను ప్రసాద్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరుబయటే ఉన్న ప్రసాద్ భార్య తమ కూతురికి అన్నం తినిపిస్తోంది. అయితే అప్పుడే గిన్నెలో అన్నం అయిపోవడంతో .. ఇంట్లోకి వెళ్లి వేసుకొస్తానని వెళ్లింది. అంతే ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. అప్పటికే అక్కడున్న రితికను ప్రసాద్ గమనించలేదు. తండ్రి ట్రాక్టర్ తీస్తున్న సంగతి తెలియని చిన్నారి .. అతని వద్దకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ట్రాక్టర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. పాప అరుపులు విని ప్రసాద్ ట్రాక్టర్ ఆపిన ప్రయోజనం లేకపోయింది. ఆ పసిపాప తీవ్రగాయాలతో కొనప్రాణంతో కొట్టుమిట్టాడింది. వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు బయల్దేరారు. అయితే ఆ పసి పాప ప్రాణం దవాఖానకు వెళ్లేవరకు కూడా ఆగలేదు. మార్గమధ్యలోనే మృతించెందింది. దీంతో ఆ పేరెంట్స్, బంధువులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. తమ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

English summary
Karimnagar district is located in the village of Cherlabootaku. They have three years old baby Rithika. Prasad has own a tractor. So he does his own farm work. But as soon as the tractor was taken, their daughter fell under the rubble and fell dead. The parents are crying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X