• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్..వివాదం... . అసలు టేపులో ఏముంది...?

|

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేపుల వ్యవహారం చిలికి చిలికి గాలి వానాలా తాయారవుంతోంది. ఎన్నికల ఖర్చుల వివరాల కోసం జిల్లా కలెక్టర్ సర్పరాజ్ మరియు ఎంపీ బండి సంజయ్‌ల ఆడియోపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో కలెక్టర్ వివరణను కూడ కోరింది. మరోవైపు తనను ఎన్నికల్లో డిస్‌క్యాలిఫై చేసేందుకు బండి సంజయ్ కుట్ర పన్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఆడియో టేపుల వ్యవహరం మరోసారి రెండు పార్టీల మధ్య వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీం కేసీఆర్ ఆరా...

సీం కేసీఆర్ ఆరా...

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ సర్పరాజ్ ఆడియో టేపుల సంభాషణపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆడియో టేపులపై మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రప్రభుత్వం కలెక్టర్ వివరణను తీసుకుంది. అయితే బండి సంజయ్ తనతో మాట్లాడింది నిజమేనని, చెప్పారు. ఎలక్షన్ల ఖర్చుకు సంబంధించి వివరాలు అడగినట్టు ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టేపులకు సంబంధించి ఎప్పుడు విడుదల అయ్యాయి. అందులో ఉన్న పూర్తి సమాచారం గురించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ప్రత్యేకంగా ఇంటలీజెన్స్ వ్యవస్థ కూడ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

నాపై కుట్ర జరిగింది... మంత్రి గంగుల కమలాకర్

నాపై కుట్ర జరిగింది... మంత్రి గంగుల కమలాకర్

దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమాలాకర్ స్పందించారు. ఆ వీడియో విన్న తర్వాత తనను ఓడించేందుకు కుట్ర జరిగిందని చెప్పారు. కేవలం ప్రజలతో పాటు సీఎం కేసీఆర్ మరియు దేవున్ని నమ్ముకుని తాము ఎన్నికల్లో దిగామని , కాని తన వెనక ఇంత కుట్ర జరిగిందని తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్యంగపదవిలో ఉన్న కలెక్టర్ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయమని సలహా ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన తెలిపారు. జరిగిన సంఘనటపై పూర్తి వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి గంగుల ఖర్చుపై కోర్టుకు వెళ్లిన బండి సంజయ్

మంత్రి గంగుల ఖర్చుపై కోర్టుకు వెళ్లిన బండి సంజయ్

ముఖ్యంగా మంత్రి గంగుల కమాలాకర్ 2018 ఎన్నికల్లో చేసిన ఖర్చులపై బండి సంజయ్ కోర్టు వెళ్లారు. అధిక ఖర్ఛులు చేశారంటూ తన ఫిర్యాదులో పేర్కోన్నారు. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ సర్పరాజ్‌ను ఫోన్లో వివరణ కోరాడు. వివరణ కోరిన ఆడియో టేప్ ప్రస్తుతం వివాదానికి కారణం అందులో వివాదానికి సంబంధించి ఒక్క నిమిషం నిడివి గల ఆడియో అప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండగా...మొత్తం ఎనిమిది నిమిషాల పాటు ఉన్న ఆడియో టేపు ప్రముఖ చానల్‌లో ప్లే చేశారు. కాగా ఇప్పుడు అదే ఆడియో ప్రస్తుత వివాదానికి కారణమవుతోంది.

ఏం జరిగింది...అడియో టేపులో ఏముంది.

ఏం జరిగింది...అడియో టేపులో ఏముంది.

ముఖ్యంగా వారి ఇరువురి సంభాషణల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి చర్చ జరిగింది. దీంతో పాటు పోస్టల్ బ్యాలట్స్‌లో వచ్చిన ఓట్లపై బండి సంజయ్ వివరణ అడిగారు. పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్‌లో లోపాలు జరిగాయంటూ తన దృష్టికి వచ్చిందని... వాటి గురించి కలెక్టర్‌ను వివరణ కొరారు. అయితే కౌంటింగ్ అంతా నియమాల ప్రకారమే జరిగిందని వాటిని మీడియాకు కూడ ఎప్పటికప్పుడు వివరించామని కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్‌లో ఎలాంటీ లోపాలు ఉండే అవకాశాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కమీషన్ ప్రోసిజర్ చాలా సీరియస్‌గా చేశారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఖర్చులు పెట్టినట్టు రుజువైన ఎమ్మెల్యేలపై రెండు రోజుల క్రితమే కోర్టు అనర్హత వేటు వేసిందని, కలెక్టర్ వివరించారు. అనంతరం బండి సంజయ్ నంబర్ మెసెజ్ చేయమని చెప్పారు. ఏదైనా ఉంటే ఫోన్లో కాంటాక్ట్ కావచ్చని కలెక్టర్ చెప్పారు.

 నేను వివాదంపై స్పందించను ..ఎంపీ బండి సంజయ్

నేను వివాదంపై స్పందించను ..ఎంపీ బండి సంజయ్

అయితే గత ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ అయ్యాయని అందులో భాగంగానే తన ఫోన్ కూడ ట్యాప్ అయి ఉండవచ్చని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. మంత్రి గంగుల కమాలాకర్ చేసిన ఆరోపణలపై తాను స్పందించనని చెప్పారు. ఖర్చుల కేసు కోర్టులో ఉందని చెప్పారు. నిబంధల ప్రకారమే కలెక్టర్‌తో మాట్లాడినట్టు తాను వివరించారు. తాను కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించానని , వారికి ఏవైనా ఆధారాలు ఉంటే కేసులు పెట్టి, కోర్టుకు ఇవ్వవచ్చని ఆయన సూచించారు. అంతేకాని ఈ విషయంలో తాను ఎలాంటీ వ్యాఖ్యలు చేయనని ఎంపీ బండి సంజయ్ చెప్పారు.

English summary
Karimnagar MP Bandy Sanjai and collector sarparaj ahmad audio tapes causes to political disputes in the state. The state government is looking into the audio tape matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X