• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈటల వర్సెస్ హరీశ్: మొసలి కన్నీరు, రబ్బర్ స్టాంప్.. హాట్ కామెంట్స్

|

హుజురాబాద్ బై పోల్ వేళ.. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య అటాక్- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. మంత్రి హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోందిది. ఈటల రాజేందర్‌ది మొసలి కన్నీరు అని హరీశ్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్‌కు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవీ తప్ప అన్ని పదవులు కల్పించిందని వెల్లడించారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని హరీశ్ రావు కామెంట్ చేశారు.

బొట్టుబిళ్ల, కుట్టుమిషన్లు

బొట్టుబిళ్ల, కుట్టుమిషన్లు

ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు ఆర్థిక ఆసరా నిమిత్తం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీశ్ విమర్శించారు. హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా కమలాపూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడుపుతూ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

రబ్బర్ స్టాంప్

రబ్బర్ స్టాంప్


హరీశ్ రావుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివారిని అన్నారు. తాను సీఎం కావాలని అనుకున్నానని హరీశ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయాన్ని హరీశ్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని అన్నారు. పార్టీకి తాను రాజీనామా చేయలేదని... తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెపితేనే చేశానని తెలిపారు. హరీశ్ రావుకు ఆయన మామ కేసీఆర్ ఉన్నారని... ఆయన మాదిరి తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అడుగులకు మడుగులు ఒత్తేవారికే ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం రిహార్సల్ మాత్రమేనని చెప్పారు.

దళితబంధువు..

దళితబంధువు..


హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

  పెంచిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళా నేతలు
  కంటిన్యూ చేస్తారా..?

  కంటిన్యూ చేస్తారా..?

  దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా వారి సంగతి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే అర్హులను ఎంపిక చేసి.. నగదు కూడా జమ చేశారు. ఈ క్రమంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  dialogue war between harish rao and etela rajender. harish rao is rubber stamp etela alleges.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X