కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారు తెలివి చూసిండ్రా..! సర్వీస్ బుక్కులో పుట్టినతేదీ మార్చిండు..!

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి : ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువర్యుడు ట్రాక్ మార్చాడు. సదరు ఉపాధ్యాయుడు చేసింది ఆషామాషీ తప్పు కాదు. ఏకంగా సర్వీస్ బుక్కునే గెలికిండు. 5 సంవత్సరాల సర్వీస్ కలిసి వచ్చేలా పుట్టిన తేదీని మార్చేశాడు.

సాంకేతికత తెచ్చిన తంటా : ఫిజికల్ టెస్ట్ ల్లో టైం ఛేంజ్, క్యాండెట్ల ఆందోళనసాంకేతికత తెచ్చిన తంటా : ఫిజికల్ టెస్ట్ ల్లో టైం ఛేంజ్, క్యాండెట్ల ఆందోళన

రామగుండం ఎన్టీపీసీ జడ్పీ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు పందిళ్ల శంకర్‌. ఎవరూ లేని సమయంలో సర్వీసు బుక్కులో పుట్టిన తేదీ మార్చేశాడు. తనకు సంబంధించిన సర్వీస్ రికార్డు స్కూళ్లోనే ఉండటంతో తన పని సులువైంది. 07-07-1960 గా ఉన్న ఆయన అసలు జన్మదినాన్ని 07-07-1965 గా దిద్దాడు. అయితే హుస్నాబాద్ కు చెందిన కేడం లింగమూర్తి పరిశీలనలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.

government teacher changed his date of birth in service record

లింగమూర్తి ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్.. అంతర్గత విచారణ జరపాల్సిందిగా డీఈవో ను ఆదేశించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు విచారణ చేపట్టగా.. విద్యార్హతల ధృవీకరణ పత్రాలు తన దగ్గర లేవని బుకాయించాడు సదరు ఉపాధ్యాయుడు. అయితే గొడిశాల యూపీఎస్‌లో 1 - 7వ తరగతి వరకు చదువుకున్నాడు శంకర్‌. ఆ స్కూల్ రికార్డుల ప్రకారం ఆయన పుట్టిన తేదీ 07-07-1960గా ఉంది. హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన సందర్భంగా తన పుట్టిన తేదీని 1960గానే పేర్కొన్నాడు.

సర్వీసు బుక్కునే గెలికిన సదరు ఉపాధ్యాయుడి తీరుపై లోతుగా విచారణ జరిపారు డీఈవో. 1960కి బదులు 1965 గా మార్చినట్లు గుర్తించారు. మొదట బుకాయించినా.. చివరకు పుట్టినతేదీని దిద్దినట్లు అంగీకరించిన శంకర్ లిఖితపూర్వకంగా తప్పు ఒప్పుకున్నాడు. అయితే పూర్తి నివేదికను కలెక్టరుకు సమర్పించిన తర్వాత శంకర్ పై తగిన చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.

English summary
The Government Teacher has been changed his date of birth in service book. One person complaint to district collector then he directed DEO to investigation. In DEO's investigation found that the teacher has been made mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X