కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురుకు మాయమాటలు.. నెల రోజుల మనవరాలిని రూ. లక్షా 10వేలకు అమ్మేసిన అమ్మమ్మ

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జిల్లాలోని వీణవంక మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన అప్పులు తీర్చేందుకు ఏకంగా సొంత మనవరాలినే అమ్ముకుంది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. నిందితులందర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అప్పులు కట్టేందుకు..

అప్పులు కట్టేందుకు..

వివరాల్లోకి వెళితే.. వీణవంక మండల కేంద్రానికి చెందిన మోతే పద్మ, రమేష్‌ల కూతురును ఆమె అమ్మమ్మ సరిగిరి కనుకమ్మ అప్పులు కట్టుకునేందుకు అమ్మకానికి పెట్టింది. రూ. లక్షా 10వేలకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి 4 రోజుల క్రితం అమ్మేసింది. పద్మ, రమేష్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం పద్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

కూతురుకు మాయమాటలు చెప్పి..

కూతురుకు మాయమాటలు చెప్పి..

ఇటీవల రమేష్-పద్మ మధ్య గొడవలు జరగింది. దీంతో వారం రోజుల క్రితం పద్మ తన కూతురును తీసుకుని వీణవంక గ్రామంలోని తన తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కాగా, పద్మకు ఇంతకుముందే వివాహం జరిగగా, మొదటి భర్తతో ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత రమేష్‌ను పద్మ ప్రేమ వివాహం చేసుకుంది. మొదటి నుంచి తల్లికి మరో కులం వ్యక్తిని పద్మ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ క్రమంలో తిరిగి తన వద్దకు వచ్చిన పద్మను మాయమాటలతో ఒప్పించి పలు కాగితాలపైసంతకాలు చేయించింది కనకమ్మ.

Recommended Video

AP Rains Alert మరో రెండు రోజులు భారీ వర్షాలు, గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం | Oneindia Telugu
నెల రోజుల శిశువును అమ్మేసి.. తాత ఫిర్యాదుతో..

నెల రోజుల శిశువును అమ్మేసి.. తాత ఫిర్యాదుతో..

ఆ తర్వాత నెలరోజుల క్రితం పుట్టిన ఆఢశిశివును గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి అమ్మేసింది. దీని ద్వారా వచ్చిన డబ్బులతో తన అప్పులను తీర్చేసింది కనకమ్మ. ఇదే విషయం కూతురుకు కూడా చెప్పింది. కాగా, తన కూతురు పద్మకు పుట్టిన ఆడపిల్లను అమ్ముకున్నారని తెలియడంతో ఆమె తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కనకమ్మ, ఆమెకు సహకరించినవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
grandmother sold her granddaughter for Rs 1.10 lakhs in karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X