కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లీగల్ గా వ్యాపారం చేస్తే మాఫియా అంటారా .. మూడు రోజులు గ్రానైట్ క్వారీలు బంద్

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకేయాలకు కేంద్ర బిందువుగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య వివాదం క్వారీల యజమానులకు తలనొప్పిగా మారింది. రాజకీయాల్లోకి గ్రానైట్ క్వారీలను లాగాతంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వారీల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేస్తుండగా ఆరోపణలు నిరూపించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇక గ్రానైట్ మాఫియా రెచ్చిపోయిందని , గ్రానైట్ అక్రమాలతో నలుగురు మంత్రులకు సంబంధం ఉందని, సీబీఐ తో విచారణ చేయించాలని బిజెపి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేసిన నేపధ్యంలో గంగుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పరువునష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.

టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుటీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక ఈ గ్రానైట్ వార్ పై గ్రానైట్ క్వారీల ఓనర్ల సంఘం చాలా సీరియస్ గా ఉంది. గ్రానైట్ మాఫియా అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము మాఫియా కాదని, ఎవరు పడితే వాళ్ళు తమను మాఫియా అని పేర్కొనటం తమకు బాధ కలిగిస్తుందని అంటున్నారు గ్రానైట్ క్వారీ ఓనర్ల సంఘం . చట్టబద్ధంగా అన్ని అనుమతులతో వ్యాపారం చేసుకునే తమను గ్రానైట్‌ మాఫియాలంటూ విమర్శించడాన్ని కరీంనగర్‌ జిల్లా గ్రానైట్‌ క్వారీ ఓనర్ల సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Granite Quarries Bandh for three days for granite mafia comments

తాము లీగల్ గా వ్యాపారం చేసినా ప్రభుత్వానికి తాము పన్ను ఎగవేతదారులులాగా , మాఫియాలుగా కొందరు తమను చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా కొందరు చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా మూడు రోజులపాటు గ్రానైట్‌ ఇండస్ట్రీ బంద్‌ పాటిస్తున్నామని సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు ప్రకటించారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాల గ్రానైట్‌ క్వారీ ఓనర్ల సంఘాలు, పాలిషింగ్‌ యూనిట్ల యజమానులు గ్రానైట్ క్వారీ ఓనర్ల సంఘం బంద్ కు సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేస్తున్న పన్ను ఎగవేత ఆరోపణలలో వాస్తవం లేదని పేర్కొన్న వారు ఎంపీ వ్యాఖ్యలను టార్గెట్ చేశారు . మాఫియాలంటూ తమను విమర్శిస్తే చట్టపరంగా చర్యలకు వెళ్తామని వారు వార్నింగ్ ఇస్తున్నారు .

English summary
Granite quarries owners association are outraged at the comments made by the politicians about the granite businessmen as granite mafia. The Granite Quarry Owners' Association Karimnagar district have strongly condemned the granite mafia for criticizing all legally licensed businessmen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X