కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ మోడీ ఎలా గెలిచారబ్బ..!! నాయిని ఏం చెప్పారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

రామగుండం/కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయదుందుబి మోగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొత్త భాష్యం చెప్పారు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి. మోడీ చరీష్మా ఉన్న లీడర్ కాదని .. తన హయాంలో చేసిన పనులను చెప్పి విజయం సాధించారని పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయిని నర్సింహారెడ్డి.

ఎలా గెలిచారబ్బ ..
గత ఎన్నికల్లో బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దళం చేసిన దాడులను మోడీ వాడుకున్నారని నాయిని నర్సింహారెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. వాయుసేన చేసిన విరోచిత దాడులను మోడీ తన స్వ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. దీంతోనే మళ్లీ కమలం వికసించిందని పేర్కొన్నారు. లేదంటే దేశంలో ఫెడరల్ ఫ్రంట్ పురుడుపోసుకునేదని అభిప్రాయపడ్డారు. నిజానికి మోడీ గెలవడంతో ఓనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. రైల్వే, ఎన్టీపీసీని పూర్తిగా ప్రైవేటీకరించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

how modi win again : nayini narsimha reddy

పీపీపీ సరికాదు ..
ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు నాయిని నర్సింహారెడ్డి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడం ఖాయమని అంచనా వేశారు. ముందే కార్మికులు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైల్వేలో దాదాపు 12 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల ప్రయాణికులను, సరుకులను గమ్యస్థానానికి చెరవేస్తున్న రైల్వేలను కూడా ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అంతేకాదు రైల్వేల ప్రైవేటీకరణ జరిగితే సామాన్యుడికి రైలు ప్రయాణం ఖరీదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేల ప్రైవేటీకరణ అనే అంశాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
The BJP alliance has won the general election. However, a new version on this is said by former minister Naini Narsimhareddi. Nayini Narsimhareddi participated in an event at Ramagundam on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X