కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ఉన్నాను.. ఎక్కడికీ వెళ్లలేదు.. వామనరావు మర్టర్ కేసుపై పుట్ట మధు

|
Google Oneindia TeluguNews

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు. అడ్వకేట్ దంపతుల కేసు విచారణ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెడుతానని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్‌మెంట్ అడగలేదని తెలిపారు.

వామనరావు దంపతుల హత్య కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్: స్పాట్‌లో కుంట శ్రీను అండ్ కో వామనరావు దంపతుల హత్య కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్: స్పాట్‌లో కుంట శ్రీను అండ్ కో

బీసీ జడ్పీ చైర్మన్ అయితే... మరీ ఇలానా..

బీసీ జడ్పీ చైర్మన్ అయితే... మరీ ఇలానా..


ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని పుట్ట మధు తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా.. లేక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు. కొందరు మీడియా ప్రతినిధులకు పుట్ట మధు సూటి ప్రశ్నలు వేశారు. తన వద్ద డబ్బులు లేకుంటే మమ్మల్ని బదనాం చేశారని మండిపడ్డారు. శ్రీధర్‌బాబు కోట్ల రూపాయల ఇస్తూ హైదరాబాద్‌లో మీడియాను మేనేజ్ చేస్తే తనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని పైరయ్యారు.

శ్రీధర్ బాబుకు మద్దతుగా కథనాలు

శ్రీధర్ బాబుకు మద్దతుగా కథనాలు

అందులో శ్రీధర్ బాబుకు మద్దతుగా కథనాలను రాయిస్తున్నారని తెలిపారు. మీడియా రేటింగ్‌ల కోసం తనకు అన్యాయం చేస్తారా అని పుట్ట మధు ప్రశ్నించారు. లాయర్ దంపతుల హత్య కేసులో సూత్రదారి పుట్ట మధు అని ప్రచారం జరుగుతోంది. స్థానిక రాజకీయాల నుంచి వచ్చిన మధు.. లోకల్ పాలిటిక్స్‌లో పట్టు సాధించేందుకు అడ్డు వస్తున్న వారిపై సామదాన దండోపాయ విద్యను పాటించేందుకు వెనుకాడడనే చర్చ జోరుగా సాగుతోంది. న్యాయవాదుల హత్య.. పుట్టా మధు రాజకీయ జీవితంపై మచ్చ పడేలా చేసింది.

సీఐడీకి వామనరావు మర్డర్ కేసు..?

సీఐడీకి వామనరావు మర్డర్ కేసు..?


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంచలన కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు, బోధన్‌ స్కాం.. ఇలా తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులన్నీ సీఐడీకి అప్పగించారు. ఇప్పుడు వామన్ రావు దంపతులు హత్య కేసును కూడా సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికితోడు టీఆర్ఎస్ నేతపై ఏ-1గా ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వాస్తవానికి అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. టీఆర్ఎస్ నేతగానే అంటారు.

English summary
iam here only.. peddapalli zp chairman putta madhu on vamana rao couple murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X