కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పదుల మందికి నీతులు చెబుతూ, స్వచ్ఛ స్పీచులు దంచేవాడాయాన. సారులో మరో కోణం కూడా ఉంది.. అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని సొంత పార్టీలో పని చేస్తోన్న మహిళా కార్యకర్తను లైంగికంగా లొంగదీసుకున్నాడు. తాను చెప్పిన చోటికి ఆ మహిళను పిలిపించుకుని ఏకాంతంగా గడిపేవాడు. అంత పెద్ద నాయకుడే తనపై సాగిస్తోన్న వికృతాన్ని కొన్నాళ్లు భరించి, చివరికి బట్టయలు చేసిందా మహిళ..

 ఏపీలో ఏడాదిగా నిశబ్ద యుద్ధం - సైనికులకు సీఎం జగనే స్ఫూర్తి - అందరి చూపు ఇటేనంటోన్న వైసీపీ ఏపీలో ఏడాదిగా నిశబ్ద యుద్ధం - సైనికులకు సీఎం జగనే స్ఫూర్తి - అందరి చూపు ఇటేనంటోన్న వైసీపీ

బీజేపీ నేత నగ్న వీడియోలు..

బీజేపీ నేత నగ్న వీడియోలు..

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రాసలీలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతకాలంపాటు సాగిన రాసలీలల వ్యవహారాన్ని సదరు మహిళా కార్యకర్త బయటపెట్టింది. తనతోపాటు గదిలో బీజేపీ జిల్లా అధ్యక్షడు నగ్నంగా ఉన్న వీడియోలను, చెప్పిన చోటికి రావాలంటూ ఆయన చేసిన ఫోన్ కాల్ ఆడియోలను బాధిత మహిళ బహిర్గతం చేయడంతో అడ్డంగా బుక్కైపోయాడు బాస సత్యనారాయణ..

ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్

పోలీసులు, నేతలతో సెటిల్మెంట్ యత్నం..

పోలీసులు, నేతలతో సెటిల్మెంట్ యత్నం..


లైంగిక వేధింపుల వ్యవహారంలో బాధత మహిళ వీడియోలు తీసిందని తెలిసిన తర్వాత కరీనంగర్ బీజేపీ చీఫ్ బాస సత్యనారాయణ తన రాజకీయ, ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించి ఆమె నోరు మూసేయించే ప్రయత్నం చేశాడు. అందుకోసం పోలీసులను, మరీ ప్రధానంగా కరీంనగర్ ఏసీపీని రంగంలోకి దించి.. మహిళతో మాట్లాడించాడు. డీల్ లో.. బాధిత మహిళ 15 లక్షలు కావాలని డిమాండ్ చేయగా.. 9 లక్షలు ఇస్తానని బాస సత్యనారాయణ అంగీకరించాడని ఆడియోల ద్వారా వెల్లడైంది. కానీ..

మహిళపై దాడి సెల్‌ఫోన్ చోరీ..

మహిళపై దాడి సెల్‌ఫోన్ చోరీ..

తాను 15 లక్షలు కోరగా, 9 లక్షలు మాత్రమే ఇస్తానని బాస చెప్పడంతో డీల్ లో తనకు అన్యాయం జరుగుతోందని ఆ మహిళ భావించింది. నాయకుడి నగ్న వీడియోలు, ఆడియోలను మీడియాకు చేరవేసే క్రమంలోనే సదరు నాయకుడు మహిళ ఇంటికెళ్లి దాడిచేసి, ఫోన్ కూడా లాక్కెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టేసిందా మహిళ. ఫోన్ తిరిగివ్వాలంటూ ఆమె ప్రాధేయపడిన ఆడియోలు సైతం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

Recommended Video

AP Rains Alert మరో రెండు రోజులు భారీ వర్షాలు, గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం | Oneindia Telugu
బండి సంజయ్ ఫైర్.. బాసపై వేటు..

బండి సంజయ్ ఫైర్.. బాసపై వేటు..

తన సొంత ఇలాకా కరీంరగర్ లో.. అది కూడా జిల్లా అధ్యక్షుడే ఓ మహిళా కార్యకర్తను లైంగికంగా లొంగదీసుకుని, కామవాంఛలు తీర్చుకోవడం, గొడవల తర్వాత వీడియో, ఆడియోలు బయటికి రావడం తదిర వ్యవహారాలపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బాస సత్యనారాయణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. కరీంనగర్ జిల్లా బీజేపీ కొత్త అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ సంజయ్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉండాలని, పార్టీ పరువు తీసే పనులు చేయొద్దని ఆయన హెచ్చరించారు.

English summary
Karimnagar district BJP leader Basa Satyanarayana sexually harassed a women activist of his own party. Videos and audios related to this issue circulated on social media. Party state president Bandi Sanjay took this seriously in his own district. He suspends Basa Satyanarayana from bjp district presidency and ordered the appointment of Gangadi Krishnareddy as the new president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X