కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్య పెళ్లి కూతురు రవళి - ముగ్గురు భర్తలతో బంతాట - వాటర్ ట్యాంక్ డ్రామాతో అడ్డంగా దొరికి..

|
Google Oneindia TeluguNews

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర ఐపీఎస్ హోదాలో ఉద్యోగం చేస్తున్నానంటూ మ్యాట్రిమోని వెబ్ సైట్లలో తప్పుడు సమాచారం ఇచ్చి.. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం నలుగురు యువకుల్ని పెళ్లాడి.. వాళ్ల నుంచి లక్షల్లో డబ్బులు గుంజేసిన తిరుపతి యువతి స్వప్న అలియాస్ హరిణి చౌదరి ఉదంతరం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది. దాదాపు అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ మరో నిత్య పెళ్లి కూతురి బాగోతం బట్టబయలైంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..

లవ్ మ్యారేజ్ ఆమె స్టైల్..

లవ్ మ్యారేజ్ ఆమె స్టైల్..

జిల్లాలోని మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన రవళి అనే యువతి గడిచిన ఐదేళ్లలో ముగ్గురు యువకుల్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు కాపురం చేసి, ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా గొడవలు పడి, సెటిల్మెంట్ కింద లక్షల్లో సొమ్ములు వసూలు చేసింది. ముందుగా, 2015లో మానకొండూర్ మండలం అన్నారం కు చెందిన సురేష్ అనే యువకుడికి ఆమె వల వేసింది. పెళ్లికి అతను తటపటాయించడంతో.. శారీరకంగా వాడుకుని, మోసానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసుల భయంతో సురేశ్ పెళ్లికి ఓకే చెప్పాడు. కానీ..

విడాకుల సెటిల్మెంట్.. రెండో పెళ్లి..

విడాకుల సెటిల్మెంట్.. రెండో పెళ్లి..

సురేశ్ ను ప్రేమించి పెళ్లాడిన రవళి కొంతకాలానికే అతనితో గొడవలు మొదలు పెట్టింది. వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. నెలల తరబడి స్టేషన్ చుట్టూ తిరగలేక సురేశ్ కుటుంబం పెద్ద మనుషుల సమక్షంలో రవళితో రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకుంది. మొదటి భర్త నుంచి విడిపోయిన కొద్ది రోజులకే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యురు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని రవళి రెండో వివాహం చేసుకుంది. సరిగ్గా ఐదు నెలలు తిరిగేలోపే తన పథకాన్ని రిపీట్ చేసింది.

వైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలువైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలు

ప్రజాప్రతినిధి బంధువునంటూ..

ప్రజాప్రతినిధి బంధువునంటూ..

రెండో భర్త శ్రీనివాసరెడ్డిపైనా వరకట్నం వేధింపుల సెక్షన్ కింద కరీంనగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది రవళి. తర్వాత స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి రూ.3 లక్షలు తీసుకునేందుకు అంగీకరించింది. రెండో భర్తపై కేసు నడుస్తున్న సమయంలోనే.. సురేశ్ అనే మరో యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా వ‌ల విసిరింది. ఓ ప్రజాప్రతినిధికి తాను దగ్గరి బంధువునంటూ, ఆ నేత పేరును వాడుకుని యువకుడికి దగ్గరైంది. రెండు పెళ్లిళ్ల సంగతి దాచిపెట్టి సురేశ్ తో మూడుముళ్లు వేయించుకుంది. కానీ ఈ సారి ఆమె పథకం బెడిసికొట్టింది..

మూడో భర్త ఆత్మహత్యాయత్నం..

మూడో భర్త ఆత్మహత్యాయత్నం..

తనతో పెళ్లికంటే ముందు ఆమెకు రెండు సార్లు పెళ్లయిందన్న సంగతి తెలిసి సురేశ్ షాకయ్యాడు. పరువు తక్కువగా ఫీలైపోయి, ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డ అతను.. ఇక రవళి ముఖం చూడొద్దనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతణ్ని వదల్లేదు. పాత స్టైల్లోనే వరకట్నం కేసు పెట్టి సెటిల్మెంట్ కు ప్రయత్నించింది. సురేశ్ ఎంతకీ దారికిరాకపోవడంతో.. ప్రేమ పేరుతో కడపు చేసిన మోసం చేశాడంటూ అతని స్వగ్రామం మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా చేసింది.

పోలీసుల ఎంట్రీతో రవళి ఆటకట్టు..

పోలీసుల ఎంట్రీతో రవళి ఆటకట్టు..


మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో యువతి వాటర్ ట్యాక్ ఎక్కిన ఘటన అన్ని చానెళ్లలో ప్రసారమైంది. ప్రేమ పేరుతో సురేశ్ మోసం చేశాడని, పెళ్లి తర్వాత కలిసుండటానికి నిరాకరిస్తున్నాడని మీడియాకు చెప్పింది. గంటల హైడ్రామా తర్వాత ఆమెను కిందికి తీసుకొచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. గ్రామస్తులు, సురేశ్ కుటుంబం ఫిర్యాదు మేరకు నిత్య పెళ్లికూతురు రవళిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నమోదైనట్లు తెలుస్తోంది.

English summary
The woman, identified as Ravali, a resident of Karimnagar Chenjarla village cheated and married three men in different places across karimnagar district for money, landed in trouble. after she climbed atop a water tank at Kothagudem, third husband's village, police took her into custody. manakondur police booked ravali on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X