కరీంనగర్ సర్కార్ దవాఖాన ఫస్ట్.. కరోనా వేళ ఉత్తమ వైద్య సేవలు
కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించి.. రోగులను కోలుకునేలా ఫ్రంట్ లైన్ వారియర్స్ చేశారు. అలాంటి ఆస్పత్రులను ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి, ఇతర దవాఖానలపై సమీక్ష చేశారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరీంనగర్ ఆస్పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ రత్నమాలను మంత్రి హరీశ్ రావు సన్మానించారు. రాష్ట్రంలో ఉత్తమ కొవిడ్ ఆస్పత్రిగా కరీంనగర్ నిలిచింది. ఇదీ చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. వైద్యులు, సిబ్బంది కృషి వెలకట్టలేనిదని చెప్పారు. వారి వల్లే రోగులకు మంచి వైద్య సేవలు అందించగలిగామని చెప్పారు.
కరోనా వేళ మంచి చికిత్స పొంది.. వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. దేశంలో కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటివరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 84,127 మంది రోగులకు చికిత్స అందించారు. దేశంలో మరే ఇతర ఆస్పత్రిలో ఇంత మంది రోగులు చికిత్స పొందలేదు.

కరోనా చికిత్స పొందిన వారిలో 3762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. హైరిస్క్ గ్రూప్‌కు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడం వల్లే గాంధీ ఆస్పత్రిలో కరోనా రికవరీ రేటు 98 శాతం సాధించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 44 మంది కరోనా పేషెంట్లు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధికి కూడా గాంధీ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందజేశారు. 1,786 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు గాంధీ ఆస్పత్రికి రాగా వారిలో 1,163 మందికి సర్జరీలు చేసి వారి ప్రాణాలను కాపాడారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఎక్కువగా వచ్చారని తెలిపారు. ఇలా గాంధీలో కూడా మెరుగైన వైద్య సేవలను రోగులకు అందజేశారు. వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు.