• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

KCRపై మహిళ నిప్పులు: గుట్కాల మంత్రులు.. కవితను ఊపుతావా అంటారా..?

|

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలో మాటల యుద్దం పీక్‌కి చేరింది. నేతల మధ్యే కాదు.. ఓటర్లు కూడా భగ్గుమంటున్నారు. నియోజకవర్గంలో గల ఓ మహిళ కేసీఆర్‌ను ఏకీపారేశారు. ఆయన క్యాబినెట్ మంత్రులు, గుట్కా నమలడం, మహిళలపై కామెంట్లను ప్రస్తావించారు. అదే కవితను అంటే ఊరుకుంటావా అని ఫైరయ్యారు. ఈటల రాజేందర్ చేసిన మంచి పనులు, జరిగిన అన్యాయం గురించి వీడియోలో వివరించారు.

గుట్కాల మంత్రులు..

గుట్కాల మంత్రులు..

కేసీఆర్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు గుట్కాల మంత్రులు అని ఆమె విరుచుకుపడ్డారు. మంత్రులు పబ్లిక్‌గా గుట్కా నమలడం ఏంటీ అని ఫైరయ్యారు. వారు మంత్రులు కారు అని.. కేసీఆర్ కుక్కలు అని ఫైరయ్యారు. మంత్రి పదవీలో ఉండి ఆడ బిడ్డను ఊపుతున్నావు అనడం సరికాదని అన్నారు. అదే కవితను అంటారా.. అనాలని కోరారు. కవితను అలా కామెంట్ చేస్తే.. ఆ బాధ తెలుస్తోంది అని చెప్పారు. ఇతరులు ఒకలా.. కవిత మరొకలా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కవిత ఊఫుతుంది అంటే ఊరుకుంటావా.. ఆడదానికి రెస్పాక్ట్ ఇవ్వాల్సిందేనని అన్నారు. తల్లి తర్వాత మీరు అనుకోవాలి అనుకోవాలన్నారు. రాజేందర్ అయితే కడుపులో పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటారని విరుచుకుపడ్డారు.

 తంబాకు, బ్రాండీతో ఆదాయం..

తంబాకు, బ్రాండీతో ఆదాయం..

తంబాకు, బ్రాండీ షాపులు బంజేయాలని విసిరారు. బ్రాండీ షాపుల మీద పెట్టి.. డబ్బులు ఖర్చు చేస్తున్నావు అని గుర్తుచేశారు. రాజేందర్ కోళ్ల ఫారాలను చక్కగా చూసుకున్నారని.. వాటితోనే ఎదిగారని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ కవితకు ఇళ్లు కట్టించారని ఆరోపణలు చేశారు. పేపర్‌కు రాజేందర్ భూమి ఇచ్చారని, కవితకు భూమి ఇచ్చారని తెలిపారు. కవిత పెళ్లి చేసింది ఎవరూ అని అడిగారు. రాజేందర్ ఆనాడే కోట్లు గడించాడని.. పార్టీ కోసం ఖర్చు చేశాడని తెలిపారు.

రుపాయి లేదు.. సిగరేట్లకు..

రుపాయి లేదు.. సిగరేట్లకు..

అప్పుడు కేసీఆర్ వద్ద రూపాయి లేదని.. సిగరేట్లకు కొనుక్కునే పరిస్థితి లేదన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత రాజేందర్‌కు దక్కుతుందని చెప్పారు. విద్యార్థులకు సాయం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఇస్తే తీసుకునుడే తప్పా.. ఇవ్వడం లేదన్నారు. మహిళల ఫైసలు తీస్తే ఊరుకునేదీ లేదు... ఫామ్ హౌజ్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్‌లో రాజేందర్ 1.50 లక్షల మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. సంతోష్ రావు చెప్పిండని రాజేందర్‌ను పక్కనపెట్టారని ఆరోపించారు. ఆనాడు రాజేందర్ మంచిగా ఉంటే.. ఈనాడు సంతోష్ రావు బాగున్నాడా అని అడిగారు.

 దండం పెడితే పైసలు ఇస్తాం..

దండం పెడితే పైసలు ఇస్తాం..

రాజేందర్ మీద అభిమానంతో తాము ప్రచారం చేస్తున్నామని తెలిపారు. నీకు కావాలంటే పైసలు ఇస్తానని చెప్పారు. దండం పెడితే పైసలు ఇస్తాం అని చెప్పారు. క్వింటాల్‌కు 4 కిలోలు కొడితివి అని విమర్శించారు. కారు నాలుగు టైర్లు ఊసిపోయాయని చెప్పారు. స్టీరింగ్ కూడా ఇనుప సామానుకు వేసుకో అని సవాల్ విసిరారు. రాజేందర్‌పై కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. ముదిరాజ్ గడప ఎంత ఉందో తెలుసుకో.. అని గుర్తుచేశారు.

  KCR was misleading the people of Telangana in the name of land auction -Revanth Reddy
   తడిబట్టతో గొంతు కోశావు

  తడిబట్టతో గొంతు కోశావు

  తడిబట్టతో గొంతు కోశావు అని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. జెండాల వద్ద తమ జెండాలు పాతొద్దు అని చెప్పారు. ఆంధ్రాలో పుట్టిన కేసీఆర్.. తెలంగాణకు వచ్చాడని చెప్పారు. ఈటల రాజేందర్ పులి బిడ్డ అని చెప్పారు. ఈటల మీద ఈగ వాలిన ఊరుకోబోమని మండిపడ్డారు. బాతలపోశట్టి, తుపాకీ రాముడు అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

  English summary
  woman criticised by cm kcr on huzurabad by poll 2021. Etela Rajender Supporter Video Goes Viral and Calls TRS Ministers As Gutka People.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X