కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా

|
Google Oneindia TeluguNews

Recommended Video

కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం | Oneindia Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించారు. కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ కాంగ్రెస్, బిజేపిలపై మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి ముక్త్ భారత్ కావాలి అని ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే దేశ రాజకీయాలను మారుస్తానని ఆయన సభాముఖంగా పేర్కొన్నారు.

సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. తెలంగాణ నుంచి 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే, దాన్ని 160 సీట్లు చేసే బాధ్యత తనదేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ సాయంతో ఇతర పార్టీలను ఏకం చేసి 160 ఎంపీ సీట్లు కూడగడతామన్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే దేశం తలరాత మార్చేందుకు తాను క్రియాశీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని కేసీఆర్ ప్రకటించారు.రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం! ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం!

 KCR sensation in Karimnagar meeting .. If required, he will form a new national party

కాంగ్రెస్, బీజేపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం గుప్పించిన కేసీఆర్ కేంద్రంలో రాష్ట్రాల పెత్తనం నడవాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థలో సమూల సంస్కరణలు రావాలని ఆయన అన్నారు. దేశం మొత్తానికి ఒక సుప్రీంకోర్టు సరిపోతుందా? కేంద్రం పని కేంద్రం చేయాలి. రాష్ట్రాల పనులు రాష్ట్రాలు చేయాలి. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి. మీరు దీవించి ఆశీర్వదిస్తే దేశం తలరాత మారుస్తా. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తా' అని కేసీఆర్ అన్నారు. ఇక ఇద్దరు దరిద్రులను తరిమికొట్టాలి. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలి అని కేసీఆర్ పదేపదే పునరుద్ఘాటించారు.

English summary
TRS party chief and Telangana CM KCR conducted election campaign for the forthcoming Lok Sabha election. KCR, who started election campaign from Karimnagar as a sentiment, asked the people to vote TRS to change the politics of the country. He said the Congress and the BJP MUKTH BHARAT's need in this country. If 16 seats won, they would have to put up 160 of them. kcr says that he will form a new party to unite people for national politics if required.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X