• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

11/9.. కొండగట్టు ప్రమాదానికి ఏడాది.. పరిహారం ఏమైంది.. ఢిల్లీ నిపుణులు ఏం తేల్చారు..!

|

కరీంనగర్ : ఆర్టీసీ అధికారుల లెక్కల తీరు 65 మంది ప్రాణాలు బలిగొంది. ఆక్యుపెన్సీ రేషియో పేరిట పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిపారు. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున కొండగట్టు దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా గుర్తించిన కొండగట్టు బస్సు ప్రమాదంపై ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల ధనదాహానికి ఆనాడు అంత మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 కొండగట్టు ప్రమాదానికి ఏడాది

కొండగట్టు ప్రమాదానికి ఏడాది

కరీంనగర్ జిల్లాలో ఆంజనేయ స్వామి కొలువుదీరిన కొండగట్టు ప్రాంతంలో సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇంకా జిల్లా వాసుల కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆనాటి ఆ ఘోర ప్రమాదాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నారు. ఆర్టీసీ అధికారుల ఆదాయపు లెక్కలు 65 మంది నిండు ప్రాణాలు బలిగొన్నాయి. డిజీల్ తక్కువగా వాడి సంస్థ ఆదాయం పెంచాలన్న ఆలోచనతో డ్రైవర్లకు ప్రతి నిత్యం పాఠాలు నూరిపోస్తూ ఆ ప్రమాదానికి సాక్షి భూతాలుగా నిలిచారు ఆర్టీసీ అధికారులు.

మంత్రి పదవి.. ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్.. ఎందుకంటే..!మంత్రి పదవి.. ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్.. ఎందుకంటే..!

ఆదాయం కోసం చూసి అమాయకులను పొట్టన పెట్టుకుని..!

ఆదాయం కోసం చూసి అమాయకులను పొట్టన పెట్టుకుని..!


పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవద్దనే నిబంధనను బేఖాతరు చేశారు ఆర్టీసీ అధికారులు. ఆక్యుపెన్సీ రేషియా (OR) కొండగట్టు బస్సు ప్రమాదంలో కొంప ముంచింది. దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. వంద మందికి పైగా ప్రయాణీకులతో బయలుదేరిన ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే 24 మంది చనిపోయారు. మరో 41 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఇంకెందరో ఆనాటి గాయాలు మానక మంచానికే పరిమతం అయ్యారు. ఆనాటి బాధితుల్లో ఇంకా ఏడుగురికి ఈనాటికీ పరిహారమే అందలేదు.

నాలుగు గ్రామాల ప్రజలకు విషాదం

నాలుగు గ్రామాల ప్రజలకు విషాదం

జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలను విషాదంలోకి నెట్టేసింది. ఉత్తమ డ్రైవర్‌గా ఎంపికైన ఆ బస్సు రథసారధి 65 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఆర్టీసీకి ఆదాయం పెంచుతూ అవార్డ్ కొట్టేసిన సదరు డ్రైవర్ మరో అవార్డు కోసం పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని బాధితుల కుటుంబాల్లో విషాదం నింపారు. ఇదంతా ఆ డ్రైవర్‌ది తప్పా.. అధికారులది తప్పా అని తరచి చూస్తే.. ఓఆర్ కోసం టార్గెట్స్ పెట్టిన అధికారులదే తప్పుగా కనిపిస్తుంది.

ఈనాటికీ ఆనాటి ఘటన గుర్తు చేసుకుంటూ..!

ఈనాటికీ ఆనాటి ఘటన గుర్తు చేసుకుంటూ..!

ఆనాటి బస్సు ప్రమాదంలో అయినవారిని కోల్పోయి కుటుంబ సభ్యులు ఇప్పటికీ దుఃఖసాగరంలో కనిపిస్తున్నారు. గాయపడి ఇంకా కోలుకోలేని పరిస్థితి నరకప్రాయంగా తయారైంది. ఆనాటి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. 65 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. అదలావుంటే ప్రభుత్వం అందించిన పరిహారం తూతూ మంత్రంగానే ఉంది తప్ప బాధితుల వేదన మాత్రం తీర్చలేకపోయింది.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ఇలా.. గూగుల్ మ్యాప్‌లో తొలిసారిగా శోభాయాత్రహైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ఇలా.. గూగుల్ మ్యాప్‌లో తొలిసారిగా శోభాయాత్ర

ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు తేల్చిందేమిటి?

ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు తేల్చిందేమిటి?

ఇంతకు ఆ ప్రమాదం ఎలా జరిగింది.. ఎవరిని బాధ్యులను చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు ఏం తేల్చారు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆ ప్రమాదం జరిగి నేటికీ ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు అది ఎలా జరిగిందనేది మాత్రం స్పష్టం చేయలేకపోయారు అధికారులు. ఇప్పటికీ ప్రమాదానికి గురైన ఆ బస్సు మల్యాల పోలీస్ స్టేషన్‌లోనే క్షేమంగా ఉంది. వానకు నానుతూ, ఎండకు తడుస్తూ భద్రంగా ఉంది. కానీ 65 మందిని పొట్టన పెట్టుకున్న మృతుల కుటుంబాలకు మాత్రం ఎలాంటి భరోసా లేకుండా పోయింది.

English summary
The tragic RTC bus accident at Kondagattu In Karimnagar District that claimed 65 members lost their lives. That Incident happen last year on september 11th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X