కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ కోటలో చక్రం తిప్పుదాం.. 16 మంది మనోళ్లను గెలిపిద్దాం : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ : తండ్రిని మించిన తనయుడిగా కేటీఆర్ మరోసారి ఫుల్ మార్కులు కొట్టేశారు. కేసీఆర్ ను తలపించేలా సభికులను ఆకట్టుకునే వాక్చాతుర్యంతో కరీంనగర్ సదస్సును విజయవంతం చేశారు. ఉన్నది ఉన్నట్లుగా.. కుండబద్ధలు కొట్టినట్లుగా సాగింది కేటీఆర్ ప్రసంగం. చెప్పాలనుకున్నది సూటిగా కట్టె, కొట్టె, తెచ్చె అన్న చందంగా చెప్పి తండ్రిని మించిన తనయుడిగా స్పీచ్ అదరగొట్టారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి తొలి సన్నాహాక సదస్సు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తి కలిగించింది. ఢిల్లీ కోటలో చక్రం తిప్పాలంటే 16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు కేటీఆర్. వీడు మనోడు, వాడు మనోడు కాదనే భేషజాలు వీడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు క్యాడర్ పనిచేయాలని కోరారు.

మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?

గట్టి కట్టే అలీ సాబ్..!

గట్టి కట్టే అలీ సాబ్..!

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ హోం మినిస్టర్ మహమూద్ అలీ.. కరీంనగర్ సదస్సులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దట్టి కట్టారు. సభలు, సమావేశాల సందర్భంగా కేసీఆర్ కు దట్టి కట్టే ఒరవడిని.. ఆయన తనయుడికి కూడా కొనసాగించారు మహమూద్ అలీ. సభ ప్రారంభానికి ముందు కేటీఆర్ కు దట్టి కట్టి శుభాభినందనలు తెలిపారు. అంతకుముందు సర్వమత పెద్దలు కేటీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు. కొందరు పార్టీశ్రేణులు ఆయనకు గద, నాగలి బహుకరించారు.

పార్లమెంటరీ సన్నాహాక సదస్సులో భాగంగా తొలి పర్యటనగా కరీంనగర్ ను ఎంచుకున్నారు కేటీఆర్. ఉద్యమం మొదలు టీఆర్ఎస్ ప్రస్థానంలో కరీంనగర్ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. అందుకే ఏ కార్యక్రమం తీసుకున్నా.. ఇక్కడి నుంచి మొదలుపెట్టడం గులాబీనేతలకు ఆనవాయితీగా మారింది.

ఢిల్లీలో కనిపించాలి గులాబీ జెండా..!

ఢిల్లీలో కనిపించాలి గులాబీ జెండా..!

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ మరచిపోనంత అపూర్వమైన తీర్పు తెలంగాణ ప్రజలు ఇచ్చారని కొనియాడారు కేటీఆర్. 50 శాతం ఓటు బ్యాంకుతో 88 సీట్లు కట్టబెట్టి టీఆర్ఎస్ కు మరోసారి అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. అలాగే ఈసారి పార్లమెంటరీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించాలని.. 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం మొదలు టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా అండగా నిలబడుతోందని చెప్పుకొచ్చారు.

కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ ఓట్ల శాతం పెరిగిందని.. ఈసారి 5 లక్షల మెజార్టీ వచ్చేలా పార్టీశ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు దగ్గరగా ట్రక్కు సింబల్ ఉండటంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని.. ఇప్పుడు ఆ గుర్తును నిషేధించడంతో కారు గుర్తుకు ఇక ఢోకా లేదని అన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకంసెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకం

జిల్లాతో మరువలేని అనుబంధం

జిల్లాతో మరువలేని అనుబంధం

కరీంనగర్ తో తమ కుటుంబానికి చాలా అనుబంధముందని గుర్తుచేసుకున్నారు కేటీఆర్. తాను కూడా కరీంనగర్ లోనే చదువుకున్నానని తెలిపారు. అయితే ఈ సభకు వచ్చే ముందు కేసీఆర్ తో సమావేశమై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా ఆయన చిననాటి ఊసులు తనతో పంచుకున్నట్లు తెలిపారు.

కరీంనగర్ కు పోతున్న సందర్భంగా.. ఏం మాట్లాడాలో తన తండ్రిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. 2009 లో కేసీఆర్ తీగలగుట్టలోని నివాసంలో ఆమరణ దీక్షకు దిగినప్పుడు.. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో జిల్లావాసులు తిరగబడ్డ ఘటన తాను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. అల్గునూరు దగ్గర ఎంత పెద్ద ఆందోళన కార్యక్రమం జరిగిందో ఇప్పటికీ తన కళ్లల్లో మెదలాడుతుంటుందని వివరించారు.

జీవధారగా గోదావరి..!

జీవధారగా గోదావరి..!

సాగునీటి రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ గోదావరి నదిని జీవధారగా చూడబోతున్నామని అన్నారు కేటీఆర్. పెద్దాయన కేసీఆర్ విజన్ తో మానేరు తీరంలో మాత్రమే నీళ్లు ఉండటం కాదు ఎస్సారెస్పీ రైతాంగానికి కూడా నీళ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరందించే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఆలోచించాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి తలమానికం లాంటి కాళేశ్వరం నిర్మాణంతో ఈ జిల్లా పునీతం కానుందని తెలిపారు. ఈ జిల్లా రైతాంగం కష్టాలు తెలిసినవాడిగా జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)

 అందరూ మనోళ్లే..

అందరూ మనోళ్లే..

బూత్ స్థాయిల వారీగా టార్గెట్ పెట్టుకుని ఎక్కడోళ్లక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండని పిలుపునిచ్చారు కేటీఆర్. అందరూ ఇలా పనిచేస్తే 5 లక్షల మెజార్టీ ఖాయమంటూ జోస్యం చెప్పారు. వీడు మనోడు, వాడు మనోడు కాదనే తత్వం వీడండని పార్టీశ్రేణలకు హితవు పలికారు. తెలంగాణలో అందరూ మనోళ్లే.. మన పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవాళ్లే.. అలాంటప్పుడు ఓట్లు అడగటంలో తప్పేంటని ప్రశ్నించారు. ఆ పార్టీ వాళ్లు, ఈ పార్టీ వాళ్లు అని మీరే డిసైడ్ చేయకుండా అందర్నీ ఓట్లు అడగండని సూచించారు. వ్యతిరేకంగా ఉన్నవాళ్లకు మన వాదన వినిపించి అక్కున చేర్చుకుందామని దిశానిర్దేశం చేశారు.

ఆ రెండూ దొందూ దొందే.. అభివృద్ధి మనం చేద్దాం

ఆ రెండూ దొందూ దొందే.. అభివృద్ధి మనం చేద్దాం

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అందించిన విజయ స్ఫూర్తిని.. రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లోనూ అందించాలని కోరారు.
సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్లు కూడా డబుల్ చేస్తామని మరోసారి ప్రకటించారు. దానికోసం బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం ఎంత ఖర్చైనా వెనుకడుగు వేసేది లేదన్నారు.

55 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీకి అధికారం కట్టబెడితే ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కేవలం ఐదేళ్లలోనే అపురూపమైన కార్యక్రమాలతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరగుతున్న ప్రతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవాలంటే రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో మన తీర్పు ఏకపక్షంగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో మన గళం గట్టిగా వినిపించేలా.. 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదే వేదికపై ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

English summary
KTR has once again beaten the full marks of his father. Karimnagar conquered the seminar with impressive wording of the audience to make KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X