కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ఎస్ఎస్‌‌ను నా హెచ్చరికలు వెంటాడుతున్నాయి...అది ఎమ్ఐఎమ్‌ను టచ్‌ కూడ చేయలేదు... అక్పరుద్దిన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే అక్భర్‌రుద్దిన్ ఓవైసీ మరోసారి ఆర్ఎస్ఎస్ పై విరుచుకుపడ్డాడు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్‌ను వెంటాడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్ఐఎమ్‌ను తాకేందుకు కూడ వారు భయపడుతున్నారని అన్నారు. భయపడే వారినే ఎప్పుడు భయపెడుతుంటారని, ఎదిరించే వారిని ఎవ్వరు ఏం చేయలేరని ప్రజలకు వివరించారు.

ఎమ్‌ఐఎమ్‌ను తాకే ధైర్యం ఆర్ఎస్ఎస్‌కు లేదు...

ఎమ్‌ఐఎమ్‌ను తాకే ధైర్యం ఆర్ఎస్ఎస్‌కు లేదు...

మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ఆపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్ధుల్ వహిద్ సంస్మరణ సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్పరుద్దిన్ మాట్లాడారు. ఈనేపథ్యంలో ఆయన ఆర్ఎస్ఎస్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ తమని తాకే ధైర్యం చేయలేదని అన్నారు. ఎందుకంటే గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థను వెంటాడుతున్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలతోనే నన్ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

మోడి వస్తే చౌకిదార్ టోపీ, విజిల్ ఇస్తా...

మోడి వస్తే చౌకిదార్ టోపీ, విజిల్ ఇస్తా...

మరోవైపు ప్రధాని మోడీని సైతం విమర్శించాడు. ప్రస్థుతం దేశానికి కావాల్సింది, చాయ్‌వాలా,పకోడివాలా కాదు, దేశానికి ప్రధానమంత్రి కావాలని అన్నాడు. ఒకవేళ ప్రధాని తన దగ్గరకు వస్తే చౌకిదార్‌ టోపి ,విజిల్ కూడ ఇస్తానని అన్నారు.మరోవైపు నాథూరాం గాడ్సేను పోగిడేవారే ముస్లింలను మతతత్వశక్తులుగా చీత్రీకరిస్తున్నారని అన్నారు.ఎమ్ఐఎమ్ చరిత్ర చూస్తే ఎవరు సెక్యులర్ భావాలు ఉన్న పార్టీలో తెలుస్తుందని చెప్పారు.ఎమర్జెన్సి సమయంలో జరిగిన ఊచకోతల కారణంగానే ఎమ్‌ఐఎమ్‌ పుట్టిందని చెప్పారు.

15 నిమిషాలు విడవండి హిందూ, ముస్లిం జనాభ సమానం అయ్యోలా చేస్తాం...

15 నిమిషాలు విడవండి హిందూ, ముస్లిం జనాభ సమానం అయ్యోలా చేస్తాం...

కాగా 2013లో అక్భరుద్దిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్లింలు 25 కోట్ల మంది ఉంటే హిందువులు 100 కోట్ల మంది ఉన్నారు. 15 నిమిషాల పాటు పోలీసులు లేకుండా చూడండి అప్పుడు హిందువుల జనాభ ఎంత ఉంటుందో తేలుతుందని హెచ్చరించాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ముస్లింలు కలసి ఉండడం వల్లే విజయం సాధ్యం

ముస్లింలు కలసి ఉండడం వల్లే విజయం సాధ్యం

ఇక ముస్లింలందరు కలిసి ఉండడం వల్లే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. గతంలో కరీంనగర్ కార్పోరేషన్ స్థానంలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని ఎమ్ఐఎమ్ గెలుచుకుందని, పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని హితవు పలికారు.నేతల్లో ఉన్న విభేధాలు మరచి నాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

English summary
MIM leader Akbaruddin Owaisi once again attacked the RSS and went back to recall his controversial comment of 2013 in which he had said that if the police is removed for only 15 minutes that would be enough to balance the Hindu-Muslim population ratio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X