• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అచ్చేదిన్ కాదు నచ్చేదిన్: మోడీ సర్కార్‌పై హరీశ్ ఫైర్

|

ప్ర‌జ‌లంద‌రీ స‌హ‌కారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దామ‌ని మంత్రి హరీశ్ రావు అన్నారు. అస‌హ‌నంతో ఈట‌ల రాజేందర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. ఈటెల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు అని పేర్కొన్నారు. వీణ‌వంక మండ‌లం దేశాయిప‌ల్లి ఫంక్ష‌న్ హాల్‌లో టీఆర్ఎస్ ముఖ్య కార్య‌క‌ర్త‌లు, స‌మ‌న్వ‌య స‌మితి క‌మిటీ, బూత్ క‌మిటీ ఇంఛార్జిల స‌మావేశం జ‌రిగింది. మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు ల‌క్ష్మ‌ణ్ రావు, జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌, పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో వైస్ ఎంపీపీ ల‌త స‌హా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 నచ్చేదిన్..

నచ్చేదిన్..

బీజేపీ ప్ర‌భుత్వంలో అచ్చేదిన్ కాదు.. స‌చ్చేదిన్ వ‌చ్చింద‌ని హరీశ్ రావు విమ‌ర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అని ప్ర‌శ్నించారు. బీజేపీ అమ్మకానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారితే.. టీఆర్ఎస్ న‌మ్మ‌కానికి మ‌రో రూపంగా నిలిచింద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోంది. ఈట‌లకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగిలో ఎన్ని వడ్లు పండినా కొంటామని ఒప్పించాలి అని మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

 ప్రజల కోసం రాజీనామా

ప్రజల కోసం రాజీనామా

ఆనాడు ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఈట‌ల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని కోరారు ? ప్రజలు బాగుపడలా.. ఈట‌ల బాగుపడలా ఆలోచించండి అని సూచించారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఈట‌ల రాజేందర్ చేస్తాడా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదన్నారు. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుగుతోందని.. ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో ఆలోచించాలి అని సూచించారు. రాబోయే ఉప ఎన్నిక‌లో బీజేపీకి డిపాజిట్ ద‌క్కకుండా చేయాల‌న్నారు. హుజూరాబాద్‌కు బీజేపీ చేసిందేమీ లేద‌న్నారు. వీణ‌వంక మండ‌లంలోని ఏ గ్రామానికి కూడా బండి సంజ‌య్ రూ. 10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌లేదు. ద‌త్త‌త తీసుకున్న రామ‌కృష్ణాపూర్‌కు బండి రూపాయి ప‌ని కూడా చేయ‌లేదు అని మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

రాజీనామాస్త్రం..

రాజీనామాస్త్రం..

గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్‌లో ఎన్నికలు అనివార్యం అయ్యింది. ఇటు దళితులను ఆకట్టుకునేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు గెలుస్తారు.. ప్రజలు ఎవరికీ పట్టం కడతారు?? బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల కారణంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు.

  Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan
  పదవుల పందేరం

  పదవుల పందేరం

  నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. వకులాభరణానికి బీసీ కమిషన్ చైర్ పర్సన్, ఇతర సభ్యులను కూడా నియమించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అందుకోసమే హామీలను ఇస్తూ ముందుకు సాగుతోంది. కొన్ని నామినేటెడ్ బెర్తులను ఖరారు కూడా చేస్తోంది.

  English summary
  minister harish rao angry on central government various issues. huzurabad by poll trs candidate gellu srinivas yadav will be win he hoped.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X