కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా పోలీసులపై పార్లమెంట్ వేదికగా .. వదిలిపెట్టేది లేదంటున్న ఎంపీ బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్ర సందర్భంగా తనపై దాడి చేసిన పోలీసులు వదిలిపెట్టేది లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న తనను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన మండి పడుతున్నారు.టీఎస్‌ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఉదయం కరీంనగర్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీ లో మాట్లాడిన బండి సంజయ్ నిన్న జరిగిన దాడి పై స్పందించారు.

సీఎం కేసీఆర్ రాక్షసుడు .. షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్సీఎం కేసీఆర్ రాక్షసుడు .. షాకింగ్ కామెంట్స్ చేసిన బండి సంజయ్

బాబు అంతిమ యాత్ర సందర్భంగా ఒక ఎంపీ అన్న మర్యాద కూడా లేకుండా, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తనపై పోలీసులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామిక మన్నారు. పార్లమెంట్ వేదికగా చర్చ పెడతానని, తెలంగాణ పోలీసులను వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన తెలంగాణ పోలీసు అధికారులపై పార్లమెంటులో ప్రివిలైజ్‌ మోషన్‌ పెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు.

MP Bandy Sanjay warning.. Privilege motion would be filed in Parliament against the police

పార్లమెంటు సభ్యునిగా ఉన్న తన కాలర్ పెట్టుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎంపీ బండి సంజయ్ పై జరిగిన దాడికి సంబంధించి, పోలీసులు ప్రవర్తించిన తీరుకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ, ఇంతా జరుగుతున్నా తెలంగాణా డిజిపి ఏం చేస్తున్నారని కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటివరకు సంబంధిత పోలీసు అధికారులపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో పోలీసుల చర్యలపై పార్లమెంటు వేదికగా ప్రివిలేజ్ మోషన్ పెట్టనున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

English summary
Karimnagar MP Bandi Sanjay is outraged that police who attacked him during RTC driver Babu's funeral. BJP MP Bandy Sanjay said that a Privilege motion would be filed in Parliament against the Telangana police officers who attecked on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X