కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ట్రెయిన్ టెన్షన్: బ్రిటన్ నుంచి కరీంనగర్ 16 మంది.. ఎయిర్‌పోర్టులో నెగటివ్.. కానీ

|
Google Oneindia TeluguNews

ఎక్కడ చూసినా స్ట్రెయిన్ టెన్షన్. కొత్త రకం కరోనా వైరస్ గురించే అంతా చర్చ. బ్రిటన్ నుంచి హైదరాబాద్ ఇద్దరు వచ్చారని అందరికీ తెలుసు. అయితే కరీంనగర్ కూడా 16 మంది వరకు వచ్చారని తెలుస్తోంది. వారికి కరోనా వైరస్ పరీక్ష చేస్తున్నారు. స్ట్రెయిన్ కరోనా వచ్చిందా అనే అనుమానం వెంటాడుతోంది. కరీంనగర్ వరకు స్ట్రెయిన్ వస్తే.. ఇక పట్టణాలు/ గ్రామాలకు వేగంగా వ్యాపిస్తోందనే ఆందోళన ఉంది.

స్ట్రెయిన్ కలకలం

స్ట్రెయిన్ కలకలం


కరీంనగర్‌లో స్ట్రెయిన్ క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన స్ట్రెయిన్ వైరస్ పట్టణంలో ఆందోళ‌న నెల‌కొంది. బ్రిట‌న్ నుంచి ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాకు 16 మంది వచ్చారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు వారిని గుర్తించారు. వైర‌స్ ప‌రీక్ష‌ నిర్వ‌హించే ప‌నిలో ప‌డ్డారు. 16 మంది వ్య‌క్తులు బ్రిటన్ నుంచి వచ్చారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింద‌ని.. వీరిలో పది మంది కరీంనగర్ జిల్లా వాసులను గుర్తించి శాంపిల్ తీసుకుని పరీక్షలకు పంపించామ‌ని జిల్లా వైద్యాధికారిణి సుజాత తెలిపారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

4 పెద్దపల్లి వాసులు

4 పెద్దపల్లి వాసులు

మరో నలుగురు పెద్దపల్లి జిల్లా వాసులు కావడంతో అక్కడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఎలర్ట్ చేశామ‌ని చెప్పారు. మరొకరు వరంగల్ జిల్లా కాగా ఇంకొకరు తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి కరీంనగర్‌లో ఉన్న వేరే జిల్లాకు చెందిన ఇద్దరి సమాచారం కూడా సేకరిస్తున్నామని సుజాత తెలిపారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ అని తేలిన తర్వాతే ఇంటికి వచ్చారని తెలిపారు. ముందు జాగ్రత్తగా మరోసారి పరీక్షలు చేస్తున్నామ‌ని ఆమె తెలిపారు. వీళ్లంతా ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.

35 వేల మందికి వైరస్

35 వేల మందికి వైరస్

స్ట్రెయిన్ వైరస్ జాడ బయటకు రావడంతో మరింత ఆందోళన నెలకొంది. బ్రిటన్‌లో ఒకేరోజు 35 వేల మందికి వైరస్ వచ్చింది. ఇదీ కరోనాతో సమానం అని.. దానికి అందజేసే మందులు/ వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఎక్కడో చెప్పలేని భయం మాత్రం నెలకొంది. మరోవైపు కర్ణాటక రాత్రి కూడా కర్ఫ్యూ విధించింది. మహారాష్ట్ర కూడా అదే బాటలో పడింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

English summary
new virus outbreak in karimnagar town. virus tested for 16 people who came from britan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X