కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాడేను మోసి రుపాయకే అంత్యక్రియలు ప్రారంభించిన మేయర్..

|
Google Oneindia TeluguNews

రూపాయికే అంత్యక్రియలు ప్రకటించిన కరీంనగర్ కార్పోరేషన్ దాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఏ నగరంలో లేని ఇలాంటీ ఫథకాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ చేపట్టింది. ఈనేపథ్యంలోనే కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ మహిళ మరణించడంతో ఒక్క రుపాయికే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ మృతురాలి అంత్యక్రియలను కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ మహిళ అంతిమ యాత్రలో పాల్గోని పాడే మోసి పథకాన్ని ప్రారంభించారు.

ప్రారంభమైన రూపాయికే అంత్యక్రియలు...

ప్రారంభమైన రూపాయికే అంత్యక్రియలు...

గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ జిల్లాలోని కరీంనగర్ కార్పోరేషన్‌ పరిధిలోని ఒక్క రుపాయికే అంత్యక్రియలు ప్రారంభించానే పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే పథకానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసి సోమవారం ప్రారంభించారు. ఈనేపథ్యంలోనే పట్టణంలోని కట్టరాంపూర్‌కు చెందిన లలితా అనే మహిళ మరణించగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

 పాడే మోసి ప్రారంభించిన మేయర్..

పాడే మోసి ప్రారంభించిన మేయర్..


రూపాయి పథకం ద్వార పాడే కట్టడడం నుండి అంతిమ యాత్రలో చేపట్టాల్సిన ఉరేగింపు నుండి దహన సంస్కరాల వరకు చేపట్టిన సంప్రదాయబద్దంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తిగా నగర పాలక సంస్థ చేపట్టింది.ఇందులో భాగంగా మేయర్ రవిందర్ సింగ్ శవయాత్రలో పాల్గోని పాడే మోశారు.కాగా నగరంలోని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఎవరికి కావల్సిన విధంగా వారికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ఇదివరకే ప్రశంశలు అందుకున్న పథకం

ఇదివరకే ప్రశంశలు అందుకున్న పథకం

మరోవైపు దేశంలోనే మొదటిసారి కరీంనగర్ నగర పాలక సమితి సరికొత్త నిర్ణయం తీసుకుని చాలమందిని ఆకర్షించింది. ఈనేపథ్యంలోనే పథకం ప్రారంభం ముందే పలువురి ప్రశంశలు అందుకుంది. ఇందులో భాగంగానే ఉప రాష్ట్ర్రపతి వెంకయ్య నాయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌లు ఈ పథకంపై ప్ర్రంశంశలు కురిపించారు.

అన్ని మతాల వారికి ఈ పథకం

అన్ని మతాల వారికి ఈ పథకం

కాగా ఇందుకోసం మొత్తం కోటి యాబై లక్షల రుపాయలు కేటాయించగా, రెండు వ్యాన్లు, ఫ్రీజర్ ఇతర సామాగ్రీని కొలుగోలు చేసినట్టు మేయర్ తెలిపారు.కాగా ఇందుకోసం ప్రత్యేకంగా విభాగాన్ని కూడ ఏర్పాటు చేశామని చెప్పారు.మొత్తం మీద ఇంట్లో కుటుంభ సభ్యులు చనిపోయి భాధలో ఉండడం ఒకవైపు అయితే వేల రుపాయలు ఖర్చు పెట్టి అంత్యక్రియలు చేయలేని బీద కుటుంభాలకు ఈ పథకం చేయుతనిస్తుండడంతో పలువురి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుటుంటుంది.

English summary
one rupee's funeral scheme put it into effect today which is announced the Karimnagar Municipal Corporation recently.The funeral was held who is death of a woman from the Karimnagar town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X