కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరిత హరం మొక్కలు తిన్న మేకలను అరెస్ట్ చేసిన పోలీసులు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

హుజురాబాద్ లో మేకలను అరెస్ట్ చేసిన పోలీసులు| Goats Eat Haritha Haram Plants,End Up In Police Station

హరిత హారంలో భాగంగా నాటిన చెట్లను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డుమీద వెళ్లే మేకలు మేశాయి. దీంతో వాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ నగరంలో సమారు 900 మొక్కలను నాటింది. నాటిన మొక్కల్లో 250 మొక్కల వరకు మేకలు తిన్నాయి. మేకల యజమానికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో చివరికి వాటిపై కేసు నమోదు చేశారు. మంగళవారం కూడ రోడ్డుపై మొక్కలు తింటుండంతో వాటిని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌‌లో అప్పగించారు.కాగా వాటి యజమాని అయిన దోర్నకొండ రాజయ్య నుండి ఫైన్ వసూలు చేయాలని ఫిర్యాదులో పేర్కోన్నారు.

బంగారు లడ్డు వేలం.. పోటాపోటీ.. చివరకు ఎంత పలికిందంటే..!బంగారు లడ్డు వేలం.. పోటాపోటీ.. చివరకు ఎంత పలికిందంటే..!

కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమానికి చాల ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతోంది. దీంతో గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు, ఇతర వ్యక్తులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే భాద్యతలు తీసుకున్నాయి. తమ గ్రామాలు పచ్చగా ఉండేందుకు పెద్ద ఎత్తున నడుం బిగించాయి. దీంతో ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున చెట్ల పలు సంస్థలు మొక్కల పెంపకాన్ని ప్రారంభించాయి.. అయితే నాటిన మొక్కల్లో సరైన సంరక్షణలేక సగం మొక్కలు కూడ పెరిగే అవకాశం లేకుండా పోతుంది. దీంతో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడ అంతే ముఖ్యంగా ఆయా సంస్థలు భావిస్తున్నాయి.

Police arrested goat who ate Haritha haram plants

ముఖ్యంగా నాటిన మొక్కలు రోడ్డు మీద వెళ్లే పశువులు, మేకలు తింటుండడంతో హరిత హారం లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో మొక్కలు తింటున్న పశువులు, మేకలపై ఆయాగ్రామా పంచాయితీలు జరిమానాలు విధించడంతో పాటు వాటి యాజమాన్యాలపై కేసులు కూడ నమోదు చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో చేటు చేసుకుంటున్నాయి. ఇటివల కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామాంలో కూడ పశువులు మొక్కలను తినడంతో వాటి యజమానికి రూ. 1000 జరిమాన విధించారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ నగరంలో ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే కేసు నమోదు చేశారు.

English summary
Huzurabad police have arrested goats who eat Harita haram plants,Goats ate 250 plants, a NGO organization have complaint against the goats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X