సిరిసిల్ల కుర్రాడు, అమెరికా చిన్నది.. పెళ్లితో ఒక్కటైన జంట..
ప్రేమించే సమయంలో కుల, మతాల పట్టింపు ఉండవు. ఎల్లాలు దాటి మరీ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తెలుగు కుర్రాడు, ఫారిన్ అమ్మాయి... విదేశీ అబ్బాయి, తెలుగు అమ్మాయిల వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో పెళ్లి జరిగింది. తెలంగాణకు చెందిన అబ్బాయిని.. అమెరికాకు చెందిన మహిళ ఒక్కటయ్యారు. హిందు సంప్రాదాయం ప్రకారం వారి పెళ్లి జరిగింది.ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి బేధాలేవీ ఉండవని నిరూపించారు.

అలా పరిచయం..
ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఆకుల శ్రీకాంత్ గౌడ్ ఆప్ఘనిస్తాన్‌లో మూవన్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే అమెరికా ఆర్మీ సోల్జర్ షకీర పీటర్సన్ సంక్షోభంలో గల ఆప్ఘనిస్తాన్‌లో పనిచేసేది. వీరిద్దరికీ అలా పరిచయం ఏర్పడింది. మూడేళ్ల నుంచి ఒకరికొకరు తెలుసు.. అలా పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. అందరీ ఇళ్లలో మాదిరిగానే వీరి ప్రేమకు వ్యతిరేకత వచ్చింది. కానీ ఇంట్లో వాళ్లను మెప్పించి.. ఒప్పించారు.

ఇక్కడే పెళ్లి
వీరిద్దరూ హైదరాబాద్‌లో హిందూ సంప్రాదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. హితులు, సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు.. ఆ జంటను ఆశీర్వదించారు. అలా వీరి ప్రేమ ఖండంతరాలు దాటి.. ఇద్దరినీ పెళ్లితో ఒక్కటి చేసింది. వారిద్దరూ కాలకలం కలిసి ఉండాలని స్నేహితులు కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత వారు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్టు తెలిసింది.

ఇదివరకు వీరు కూడా..
వీరే కాదు ఇదివరకు చాలా పెళ్లిళ్లు జరిగాయి. విశాఖ జీవీఎంసీ 6వ వార్డు మధురవాడ రేవళ్లపాలేనికి చెందిన పిళ్లా శ్రీమన్నారాయణ, నిర్మల దంపతుల కుమార్తె డాక్టర్ చాముండేశ్వరి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఐర్లాండ్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ చారల్స్ పవర్ జర్మనీలో ఉద్యోగం చేస్తున్నారు. రాబర్ట్ ఏయూ నుంచి డాక్టరేట్ కూడా పొందారు.

సిటీలోనే పెళ్లి..
వీరిద్దరికి హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వివాహం విశాఖలోని సాగర్‌నగర్ బే లీఫ్ రిసార్ట్‌లో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా నిర్వహించారు.