• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?

|

రామగుండం : అతి సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. ఆడిందే ఆటగా.. ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్లుగా అడవి రాజుగా వెలిగిపోయాడు. తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖను శాసించాడు. అడవులను అడ్డంగా నరుకుతూ.. 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్ విసురుతూ దర్జాగా తప్పించుకున్నాడు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్టులు పెడతామన్న సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ వీరప్పన్ పోలీసులకు పట్టుబడటం చర్చానీయాంశమైంది.

ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో "ట్రాప్".. యువతిని లొంగదీసుకుని వికృత చేష్టలు

ఎడ్ల శ్రీను ఎపిసోడ్

ఎడ్ల శ్రీను ఎపిసోడ్

కరుడుగట్టిన కలప స్మగ్లర్‌ గా రామగుండం ఏరియాలో.. ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను పేరు తెలియని వారుండరు. ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్లుగా అడవిలో చెట్లను నరుకుతూ "తెలంగాణ వీరప్పన్" గా చలామణి అవుతున్నాడు. అసలు పేరు కంటే కొసరు పేరుతోనే పిలిపించుకోవడం ఈ అడవిదొంగకు ఇష్టమట. తెలంగాణ వీరప్పన్ అంటే తెగ మురిసిపోతాడట.

తెలంగాణ నుంచి అడవి దొంగగా నేర ప్రస్థానం మొదలు పెట్టిన ఎడ్ల శ్రీను అలియాస్ తెలంగాణ వీరప్పన్.. అంచెలంచెలుగా పొరుగు రాష్ట్రాలకు తన కార్యకలాపాలు విస్తరించాడు. అడవుల్లో టేకు చెట్లను అక్రమంగా నరుకుతూ.. వాటిని పట్టణాలు, నగరాలకు తరలించి అమ్మి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. అటవీశాఖ అధికారులకు భారీ స్థాయిలో లంచాలు ఇస్తూ, రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోయాడనే ఆరోపణలున్నాయి. అటవీప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల్లో దాదాపు 2 వేల మంది అనుచరులను ఏర్పాటు చేసుకుని దొంగ కలప దందా యధేచ్ఛగా చేశాడు.

తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్

 కోట్లల్లో దందా.. కేవలం 12 కేసులే..!

కోట్లల్లో దందా.. కేవలం 12 కేసులే..!

కలప అక్రమ రవాణాతో అటవీశాఖకు సవాల్ గా మారిన ఎడ్ల శ్రీను అలియాస్ తెలంగాణ వీరప్పన్ ఆట కట్టించారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. 20 ఏళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంటున్న అడవిదొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. కోట్ల రూపాయల్లో అక్రమ కలప దందా నిర్వహించిన ఎడ్ల శ్రీనుపై.. పోలీసులు 8 కేసులు, అటవీశాఖ అధికారులు 4 కేసులు ఫైల్ చేశారు.

"తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్".. అనే హెడ్డింగ్ తో జనవరి 30వ తేదీన "వన్ ఇండియా తెలుగు" ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. అయితే ఎడ్ల శ్రీను ను పట్టుకునే క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో ఇటీవల అక్రమ కలప డంపులు వెలుగుచూశాయి. డ్రోన్ కెమెరా సాయంతో అక్కడున్న కలప దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొరికాడు ఇలా..!

దొరికాడు ఇలా..!

గత రెండు నెలల నుంచి విశాఖ, విజయవాడ, అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. అదలావుంటే మంగళవారం (09.04.2019) తెల్లవారుజామున తనకు సంబంధించిన అక్రమ డంపులు దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతో.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చేరుకున్నాడు ఎడ్ల శ్రీను. ఆ క్రమంలో కాపుగాసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కార్పియో వాహనంతో పాటు 10 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎడ్ల శ్రీను అరెస్టును ధృవీకరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

 1999 నుంచి 20 ఏళ్ల ప్రస్థానం

1999 నుంచి 20 ఏళ్ల ప్రస్థానం

1999లో ఫర్టిలైజర్స్‌ వ్యాపారం చేసిన ఎడ్ల శ్రీనుకు అందులో నష్టాలు రావడంతో ఈ దందాను ఎంచుకున్నట్లు కమిషనర్ వివరించారు. అక్రమ కలప రవాణాతో కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు సర్పంచుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఆపై స్థాయి రాజకీయ నేతల వరకు మంచి దోస్తీ ఉందట. అంతేకాదు తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసిన రేంజ్ ఉందట.

వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!

 సామ్రాజ్యం కూలింది..!

సామ్రాజ్యం కూలింది..!

అదలావుంటే పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఎడ్ల శ్రీనుకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలిసింది. ఎడ్ల శ్రీనుకు సహకరించిన అధికారులు, రాజకీయ నేతల పూర్తివివరాలతో నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు కమిషనర్ సత్యనారాయణ. ఎడ్ల శ్రీను నుంచి అక్రమ కలపను కొనుగోలు చేసిన 18 సా మిల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎడ్ల శ్రీనుతో పాటు కె.కిషన్, కె.మధుకర్, ఆర్.శ్రీనివాస్, వడ్ల సంతోష్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

మందీ మార్బలం మామూలు కాదుగా..!

మందీ మార్బలం మామూలు కాదుగా..!

తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సదరు చెట్ల దొంగకు మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతమున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను టార్గెట్ చేసుకొని తన కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు. గోదావరి నది తీరానికి మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు దగ్గరగా ఉండటంతో ఈ జిల్లాపై దృష్టి సారించాడు. కాటారం, మహదేవ్ పూర్, ఏటూరు నాగారం, తాడ్వాయి తదితర మండలాల్లో వందల సంఖ్యలో అనుచరులు ఉండటం గమనార్హం.

అడవి దొంగలపై సీఎం నజర్

అడవి దొంగలపై సీఎం నజర్

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అడవుల సంరక్షణపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. అడవులను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతవరకైనా వెళుతుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. అడవుల నుంచి పూచిక పుల్ల బయటకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. జంగల్ బచావో, జంగల్ బడావో (అడవులను కాపాడండి, అడవులను పెంచండి) అంటూ పిలుపునిచ్చారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. అదలావుంటే తెలంగాణ వీరప్పన్ ను పట్టుకుంటే సగం అడవులు సేఫ్ అనే టాక్ వినిపించిన సందర్భాలున్నాయి. ఆ నేపథ్యంలో ఒకే ఒక్కడిగా రెచ్చిపోతున్న కలప దొంగ పట్టుబడటం ఊరటనిచ్చే అంశం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Ramagundam Commissionerate Police busted wood smuggling gang and arrested most wanted telangana veerappan alias edla srinivas. He escaping since 20 years and 8 police and 4 forest cases filed against him. At last tuesday early hours he caught with his 4 aides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more