• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మల్లన్న ఆశీస్సులతో.. నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్ హీటెక్కిస్తోంది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఫస్ట్ డే నామినేషన్ల పర్వం మొదలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి నేరుగా హుజురాబాద్‌ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్‌ యాదవ్‌ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఇలా రాజీనామా..

ఇలా రాజీనామా..

కాంగ్రెస్ నుంచి బలమూర్ వెంకట్ బరిలో దిగనున్నారు. ఆయన రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్నారు. కొండా సురేఖ కాదనడంతో.. గెలుపు గుర్రాన్ని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. మున్నురుకాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేశ్ పేర్లు వినిపించాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన సైదులు పేరు కూడా వినిపించింది. అన్నీ అన్నీ అంశాలు పరిశీలించి చివరికీ వెంకట్‌ను బరిలోకి దింపారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో తన ఎమ్మెల్యే పదవీకి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

విజయం కోసం

విజయం కోసం

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.

కోడ్ కూసింది..

కోడ్ కూసింది..

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

  VIRAL: Elephant Arrest తల్లితో పాటు పిల్ల ఏనుగు కూడా Case Filed | Ex MLA
  ఇద్దరికీ కంపల్సరీ

  ఇద్దరికీ కంపల్సరీ

  హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

  English summary
  huzurabad by poll 2021: trs candidate gellu srinivas yadav files nomination. before he offered prayers komuravelli mallanna swamy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X