కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్‌లో తెగబడ్డ ప్రేమోన్మాది.. కత్తితో ఇంట్లోకి చొరబడి యువతి హత్య..

|
Google Oneindia TeluguNews

ఓవైపు లైంగిక వేధింపుల ఘటనలు.. మరోవైపు ప్రేమ పేరుతో దాడులు.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలిని ముత్తా రాధికగా గుర్తించారు. సహస్ర జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్టు సమాచారం.

 కరీంనగర్ విద్యానగర్‌లో

కరీంనగర్ విద్యానగర్‌లో

కరీంనగర్‌ విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్ హాల్‌ వెనుకభాగంలో రాధిక ఇల్లు ఉంది. రాధిక తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా కూలీకి పనికి వెళ్లారు. రాధిక సాయంత్రం సమయంలో కాలేజీ నుంచి తిరిగొచ్చింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో...

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో...

ఇంట్లో రాధిక ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకున్న నిందితుడు కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు.పొట్ట,మెడ భాగంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రాధిక విలవిల్లాడుతూ నేలపై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

గుండెలవిసేలా రోధించిన తల్లిదండ్రులు

గుండెలవిసేలా రోధించిన తల్లిదండ్రులు


కూలీ పనికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చేంతవరకు రాధిక చనిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. తలుపులు తెరిచి చూడగా.. రాధిక రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో గుండెలవిసేలా రోధించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మహారాష్ట్రలోనూ..

మహారాష్ట్రలోనూ..

మహారాష్ట్రలోనూ ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో ఆమెను వేధించిన వికేష్ అనే యువకుడు ఈ నెల 3న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచింది. నిందితుడు వికేష్‌కు ఇదివరకే పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ప్రేమ పేరుతో అంకితను వేధించాడు. అంకిత మృతితో వికేష్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఉద్దవ్ థాక్రే సైతం ఘటనపై స్పందించారు. అంకిత కుటుంబానికి న్యాయం చేస్తామని,నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

English summary
A man allegedly stabbed a 19years old woman to death after she rejected his love proposal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X