• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మద్యం, డబ్బులు పనిచేయవు.. మీ చేతుల్లోనే అంతా ఉంది: ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప పోరు హీటెక్కిస్తోంది. చలిలో కూడా సెగలు రేపుతోంది. అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్‌కు ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. యువత ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలని ఈటల రాజేందర్ కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా యువత భయపడటం లేదన్నారు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే అని చెప్పారు. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదన్నారు.

చరిత్రలో అలా..

చరిత్రలో అలా..

చరిత్రలో మంచి రాజులు, చెడ్డ రాజులు అని చదువుకుంటారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. కేసీఆర్ ఓ చెడ్డ రాజు అని చెప్పారు. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల్లో వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా, వంద కోట్లు మందు తాగించాడు.. 4500 కోట్ల జీవోలు ఇచ్చెనని, అయినా మట్టి కరిసెననిని చరిత్ర చదువుకోబోతుందని వివరించారు. ఇటీవల సర్వేలో కేసీఆర్ చెత్త ముఖ్యమంత్రి అని తేలిందన్నారు. కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చారిత్రక కర్తవ్యం మీ చేతుల్లో ఉందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మన కళ్ళల్లో మట్టి కొట్టారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కుంటుపడేలా చేశారని అన్నారు. గద్దెదించడమే లక్ష్యంగా పని చేద్దాం అని పేర్కొన్నారు.

 విజయం కొట్టాల్సిందే..

విజయం కొట్టాల్సిందే..

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

  Huzurabad Election : TRS, BJP కలిసి పనిచేస్తున్నాయి.. ఇవే కారణాలు!!
  ఆకట్టుకునేనా..?

  ఆకట్టుకునేనా..?

  హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

  English summary
  bjp leader etela rajender slams cm kcr.youth will be punish kcr at huzurabad by poll
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X