ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ పరీక్షలు సజావుగా సాగవా ? సెల్ ఫోన్ ద్వారా లీక్ అయిన డిగ్రీ ప్రశ్నాపత్రం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు ఏవైనా సజావుగా సాగవని వరుసగా జరుగుతున్న ఘటనలు తేల్చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంటర్ పరీక్షల్లో అవకతవకల ఘటన మరువకముందే తాజాగా డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ కలకలం సృష్టిస్తోంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షల్లో ఆంగ్ల ప్రశ్నాపత్రం సెల్ ఫోన్ ద్వారా లీక్ అయింది. ఇక ప్రశ్నాపత్రం విద్యార్థుల వాట్సాప్ ద్వారా అందరికీ చేరిపోయింది. దీంతో పరీక్షను వాయిదా వేసి తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి యూనివర్సిటీ అధికారులకు వచ్చింది.

 బస్సుల్లో ప్రయాణీకులను మధ్యలో దింపేస్తున్న కండక్టర్లు .. ఎందుకో తెలిస్తే షాక్ బస్సుల్లో ప్రయాణీకులను మధ్యలో దింపేస్తున్న కండక్టర్లు .. ఎందుకో తెలిస్తే షాక్

కోదాడలోని ఎస్ వి డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ ఘటనలో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసింది ఎవరు? ప్రశ్నపత్రాన్ని ఎంతకూ విక్రయించారు? ఇక ఈ ప్రశ్న పత్రం ఎంతమంది మొబైల్ ఫోన్లలో తిరిగింది అన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు పోలీసులు. గురువారం డిగ్రీ పరీక్షల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లిష్ పేపర్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కోదాడ ఎస్వీ కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయిందని పక్కా సమాచారంతో వర్సిటీ అధికారులు నిఘా పెట్టారు. పలువురు విద్యార్థుల మొబైల్ ఫోన్లలో ప్రశ్నాపత్రాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు అందించారు. అంతేకాదు పరీక్షను మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ చేసి వేరే ప్రశ్నాపత్రంతో తిరిగి పరీక్షను నిర్వహించారు.

Any exams arent going smoothly .. degree question paper leaked in cell phone

ఓ కళాశాలకు చెందిన చీఫ్ సూపరింటెండెంట్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని కోదాడ కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అవుతుందని ముందురోజు గుర్తించిన అధికారులు పక్కా సమాచారంతో ప్రశ్నాపత్రం లీకేజీ కు సంబంధించిన విద్యార్థులను పట్టుకున్నారు. వారికి ప్రశ్నాపత్రం ఎవరి నుండి వచ్చిందో ఆరా తీశారు. ఇక ఆ ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు షేర్ చేసిన విషయాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

English summary
Degree question paper leaked in Kodada SV degree college . Who leaked the question paper in SV Degree College in Kodada? How much is the question paper sold? The question of how much shares in the mobile phones police enquiring .Actually The English paper examination will be held from Thursday 9 am to 12 noon on Thursday, but the paper wasleaked. from the information of sources university officials find out the culprits . police registered a case and investigating. university officials postponed the examination to afternoon and they conducted with another question paper .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X