ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భద్రాద్రి రాములోరికి పట్టువస్త్రాలు.. భక్తజనులకు ముత్యాల తలంబ్రాలు

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి : సమస్త భక్తజనులు లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణం భద్రాద్రిలో కనుల పండువగా జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్న సుముహుర్తాన జానకీరాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడికి యజ్ఞోపవీతధారణ, సీతాదేవికి యోత్రబంధనం కార్యక్రమాలను అర్చకులు నిర్వర్తించారు. రామాలయంలోని మిథిలా ప్రాంగణంలో జరిగిన రాములోరి లగ్గానికి భక్తజనులు పోటెత్తారు. సీతారాముల కల్యాణం కనులారా వీక్షించి జన్మధన్యమైనట్లుగా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాములోరి కల్యాణానికి పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో.. భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగేలా మిథిలా ప్రాంగణంలో కూలర్లు, ఫ్యాన్లు సమకూర్చారు.

నో సౌండ్, నో పొల్యూషన్.. హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులునో సౌండ్, నో పొల్యూషన్.. హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు

bhadrachalam sri sitarama kalyanam

ప్రతి యేటా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణం వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 3 లక్షల మేర లడ్డూలను సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తలంబ్రాల పంపిణీకి 34 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

English summary
Braving heat, thousands of devotees witnessed the celestial wedding of Lord Rama with his consort Sita, held in the temple town on the occasion of Sri Rama Navami. The rituals associated with the celestial wedding were performed by priests at Mithila Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X