• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెల్లెల్ని చెరబట్టిన అన్నలు ... ఆ కామాంధుల నుండి కాపాడాలని పోలీసులను ఆశ్రయించిన చెల్లెలు

|

అన్న అనే పదానికి అర్థం మరిచి సొంత చెల్లెలిపై పశువుల ప్రవర్తించాడు ఓ అన్న . అతను మాత్రమే కాదు, స్వయాన పెద్దమ్మ కొడుకు కూడా చెల్లెలిని చెరబట్టాడు. లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో ఆ కామాంధుల నుండి కాపాడండి సార్ అంటూ ఓ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది.

అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణం అన్నను చూసి, తమ్ముడ్ని కావాలన్న అమ్మాయి .. తమ్ముడూ రెడీ, పెళ్లి కోసం విశాఖలో దారుణం

 తనపై నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ..అన్నలపై చెల్లెలి ఫిర్యాదులు

తనపై నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ..అన్నలపై చెల్లెలి ఫిర్యాదులు

వాళ్లు అన్నయ్యలు కాదు.. కామాంధులు . చిన్నతనం నుంచీ నన్ను శారీరకంగా లోబరుచుకుని, విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ ఓ యువతి కన్నీరుమున్నీరవుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అంతేకాదు తన తల్లికి ఈ విషయాన్ని చెబితే అసభ్యంగా మాట్లాడుతుందని, పెద్దదిక్కుగా ఉన్న పెద్దమ్మ, పెదనాన్న లు సైతం ఇదంతా కామన్ అంటూ చాలా నీచంగా మాట్లాడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను వాళ్ళ నుండి కాపాడాలని విజ్ఞప్తి చేసింది.

కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం కావాలని ఫిర్యాదు

కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం కావాలని ఫిర్యాదు

20 ఏళ్ల యువతి కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరైంది .

ఇక బాధిత యువతి ఫిర్యాదుపై స్పందించిన ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక ఆయన చెప్పిన వివరాల ప్రకారం బాధిత యువతి చిన్నతనంలోనే తండ్రి ఆమె కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారు . తల్లి వారందరినీ పెంచి పెద్ద చేసింది. చిన్నతనంలో ఆమె కుటుంబం మణుగూరు లో ఉండేది. ఆమె తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పటినుంచి సొంత అన్నయ్య ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అన్న లైంగిక వేధింపులపై చెల్లెలు చెప్పే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు

అన్న లైంగిక వేధింపులపై చెల్లెలు చెప్పే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు

అప్పటినుండి తనపై తరచుగా అత్యాచారం చేస్తున్నాడని బాధిత యువతి వాపోయింది. కొన్నేళ్ల క్రితం అతనికి ఉద్యోగం రావడంతో కొత్తగూడెంకి వెళ్లారని ఆమె పెరిగి పెద్దయిన తర్వాత కూడా అలాగే అత్యాచారానికి పాల్పడుతున్నాడని, అతని వేధింపులు తట్టుకోలేక పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వేధింపులు కొనసాగాయని ఆమె చెప్పిందన్నారు .

ఇంటర్ చదువుతున్న సమయంలో పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వరుసకు అన్నయ్య అయిన వాళ్ళ కుమారుడు సైతం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

 విద్యాసంస్థలు లేక ఇంట్లోనే ఉండాల్సిన స్థితిపై వాపోయిన బాధిత యువతి

విద్యాసంస్థలు లేక ఇంట్లోనే ఉండాల్సిన స్థితిపై వాపోయిన బాధిత యువతి

పెద్దమ్మ , పెదనాన్న లకు విషయం చెప్పినా వారు చాలా నీచంగా మాట్లాడి ఇదంతా కామన్ అన్నట్టు కొట్టిపారేసేవారు అని పేర్కొంది. మెడిసిన్ ఎంట్రెన్స్ శిక్షణ నిమిత్తం ఇటీవల వేరే ప్రాంతానికి వెళ్లిన లాక్ డౌన్ సమయంలో మళ్లీ ఇంటికి రాక తప్పలేదని అప్పుడు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొంది. విద్యా సంస్థలు ఉన్న సమయంలో దూరంగా ఉండటం వల్ల వేధింపుల నుండి ఉపశమనం దొరకేదని బాధిత యువతి పేర్కొంది.

సహాయం కోసం వేడుకోలు .. న్యాయం చెయ్యాలంటున్న బాధిత యువతి

సహాయం కోసం వేడుకోలు .. న్యాయం చెయ్యాలంటున్న బాధిత యువతి


ఇప్పుడు కళాశాలలు లేకపోవడంతో తనపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి అని బాధిత యువతి పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ పోలీసులను వేడుకుంది . ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన కొత్తగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A Brother and an a co brother sexual harassed a young woman in kottagudem . The young woman complained to kottagudem police on her brothers and mother said that from her childhood her brother assaulting her. young woman approached the police and asked to save from the human beasts .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X