• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డబుల్ బెడ్రూమ్ ఇళ్లా మజాకా.. కట్టనే లేదు.. కూలిపోతున్నాయి.!

|

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అభాసుపాలు అవుతోందా? కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కార్ లక్ష్యం నీరుగారిపోతోందా? నాసిరకం సామాగ్రితో నాణ్యత లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయా? సామాన్యుల కలల రూపం రెండు గదుల ఇళ్లు కలగానే మిగిలిపోనుందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత బండారం బయటపడుతోంది. చిన్న వర్షానికే పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాసిరకం సామాగ్రి వాడుతున్నారా, కాసుల కక్కుర్తిలో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కవుతున్నారా అనే ఆరోపణలు జోరందుకుంటున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

పేకమేడల్లా కూలుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..!

పేకమేడల్లా కూలుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..!

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్దించి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది. అయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ క్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించింది సర్కార్. బంపర్ మెజారిటీతో మళ్లీ టీఆర్ఎస్ అధికార పీఠమెక్కడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది.

ఆ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామవాసులు కూడా ప్రభుత్వ ఇళ్ల కోసం కాళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలు ఆడియాసలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూలిపోయే స్టేజీకి చేరుకున్నాయి. నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు తలెత్తితే అవి ఎన్ని సంవత్సరాలు నిలబడతాయో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు.

తెలంగాణలో కరెంట్ కష్టాలా.. రెండు రోజులు దాటితే చీకట్లేనా?

నిర్మాణమే పూర్తి కాలేదు.. అప్పుడే కూలుతున్నాయి..!

నిర్మాణమే పూర్తి కాలేదు.. అప్పుడే కూలుతున్నాయి..!

దంతెలబోరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాకముందే మధ్యలోనే కూలిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ఆ క్రమంలో కుప్పకూలిపోతున్నాయి. ఈ వర్షాలకే ఇలా కూలిపోతే వాటి నాణ్యత ఏమేర ఉందో ఇట్టే అర్థమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ల నిర్మాణ సమయంలోనే ఇలా జరుగుతుంటే.. అవి పూర్తయి లబ్ధిదారులకు ఇచ్చాక ఎన్ని సంవత్సరాలు నిలబడతాయోనన్న గ్యారంటీ లేదంటున్నారు స్థానికులు. నాణ్యత లేక పేకమేడల్లా కూలుతున్న ఆ ఇళ్లు తమకు వద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఆ ఇళ్లల్లో నివాసం ఉన్నప్పుడు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?

కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?

వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలకు ఆవాసం కల్పించాలనే బ‌ృహత్తర లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వ విధానాలకు ఆదిలోనే గండి పడినట్లవుతోంది. నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరిగితే అవి ఎంతకాలం నిలబడతాయో తెలియని పరిస్థితి. అంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే.. కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The villagers of Dantelaboru in Palwacha Mandal of Bodhradri Kothagudem district are also waiting for government double bedroom houses to be raised. But their hopes were dashed. The double bedroom houses have reached the stage of collapsing rain for two to three days. The villagers are angry on contractors and government officials about the worse construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more