ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు .. ఎలాంటి లక్షణాలు లేకున్నాఓ వ్యక్తికి కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలపై తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా వ్యాప్తిని మొదట్లోనే కంట్రోల్ చెయ్యాలని భావించిన సర్కార్ లాక్ డౌన్ విధించింది .ఇక తెలుగురాష్ట్రాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ వ్యాప్తిని తగ్గించటానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఢిల్లీలో నిజాముద్దీన్ సభ తెలుగురాష్ట్రాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఊహించని విధంగా కేసులు పెరిగాయి. ఇక తెలంగాణలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్నామొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని ఖమ్మం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటం , సదరు వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేకపోవటం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

తెలంగాణ‌లో క‌రోనా చాలా జిల్లాల్లో తన ప్రభావం చూపిస్తున్నా ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఇంత‌వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. దీంతో జిల్లాలోని ప్ర‌జలంతా జిల్లా సేఫ్ అని భావించారు. కానీ అక్క‌డ కూడా ఇప్పుడు క‌రోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో టెన్ష‌న్ నెల‌కొంది. ఇక సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు ఏ మాత్రం లేకపోవటం గమానార్హం . ఇక అతను ఢిల్లీ లో జరిగిన తబ్లీఘీ జమాత్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి . ఇక ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

First corona case in Khammam district .. Corona positive for a person with no symptoms

మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతనితో కలిసి ప్రయాణం చేసిన వారిని క్వారంటైన్‌కి తరలించి బ్లడ్ శాంపిల్స్ పంపించారు. రిపోర్టులో క్వారంటైన్ లో ఉన్న‌వారిలో ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని కలిసిన 40 మంది వ్యక్తులను క్వారంటైన్‌కి తరలించి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి లక్షణాలు లేకపోయినా బాధితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. జలుబు, జ్వరం దగ్గు లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలుస్తుంది. అయితే బాధితుడు టీబీ పేషెంట్‌ కావడంతో డాక్ట‌ర్లు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు.

English summary
Corona is terrifing Telangana state. When Corona positive traced out a man traveled from Mahabubabad to Delhi nijamuddin meeting, the officers accompanied and traveled people to Quarantine and sent blood samples. Reportedly, one of the people in Quarantine was diagnosed with coronavirus, and 40 people who had met him were sent to Quarantine to perform tests. However, Minister Puvvada Ajay Kumar said that the victim was diagnosed as corona positive if there were no symptoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X