ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు , రాయబారులు అవుతారు ! సంచలన ప్రకటన చేసిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ యోతర పార్టీలు అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన కేంద్రంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీయోతర పార్టీలే అధికారం చేజిక్కుంచుకోనుందని ఆయన స్పష్టం చేశారు.రెండు పార్టీలు కలిసిన అధికారం చేజిక్కుంచుకునే అవకాశాలు కూడ లేవని అన్నారు.ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈసారి గవర్నర్లు, భారత రాయబారులు సైతం అవుతారని అన్నారు.

టిఆర్ఎస్ నుండి గవర్నర్ లు, విదేశీ రాయబారులు :సీఎం కేసీఆర్

టిఆర్ఎస్ నుండి గవర్నర్ లు, విదేశీ రాయబారులు :సీఎం కేసీఆర్

ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఎప్పుడు ఎక్కడ చెప్పలదంటూనే , టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మేల్యేలు, ఎంపీలు ,మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడ అవుతారని వీటితో పాటు గవర్నర్లు ,విదేశీ రాయబారులు సైతం అవుతారని తాను గతంలోనే పార్టీ శ్రేణులకు చెప్పానని గుర్తు చేశారు. కాగా ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు,ఎంపీలతోపాటు మంత్రులు ,ముఖ్యమంత్రులు ,కేంద్రమంత్రులు సైతం అయ్యారని ఇక మిగిలిన పదవులైన గవర్నర్లు, విదేశీ రాయబారులుకూడ అవుతారని చెప్పారు. రానున్న కాలంలో అవి సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీకి 160, కాంగ్రెస్ కు 100 లోపు స్థానాలు : సీఎం కేసీఆర్

బీజేపీకి 160, కాంగ్రెస్ కు 100 లోపు స్థానాలు : సీఎం కేసీఆర్

జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న బీజేపీ ,కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసిన వారికి మెజారిటి రాదని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది ఆశామాషిగా చెప్పడం లేదని అన్నారు. కాగా దేశంలోని అనేక పార్టీలతో మాట్లాడిన తర్వాత నేను చెబుతున్నానని అన్నారు.ఈ నేపథ్యంలోనే బిజేపి స్వంతగా 130 నుండి 140 స్థానాలు దాటవని అలాగే ఏన్డీఏ కూటమీకి కూడ 160 సీట్లు మాత్రమే దక్కుతాయని అన్నారు .మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం 100 స్థానాల లోపే స్థానాలను కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నారని చెప్పారు

విభేధాలు పక్కన పెట్టి నామా ను గెలిపించండి, సీఎం

విభేధాలు పక్కన పెట్టి నామా ను గెలిపించండి, సీఎం

కాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ తోపాటు , ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి ల భాద్యత తనదని , ఈనేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేధాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాలు పక్కన బెట్టి పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు వచ్చారు. ఈనేపథ్యంలోనే తుమ్మల తోపాటు ,శ్రీనివాస రెడ్డి ల సేవలను తాను వాడుకుంటానని వారిని మరచిపోనని అన్నారు.

English summary
The telangana Chief minister KCR said that Governors and Indian Ambassadors will also be in the coming days from the TRS party.As I said, MLAs, MPs, ministers, chief ministers, union ministers became from the party, the remaining the governors and the foreign ambassadors will be elected ofter election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X