ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలంగా వీచిన ఈదురు గాలులు: కొట్టుకుపోయిన బస్సు(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కాగా, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి.

Recommended Video

Viral Video : Bus Going Back Due To Heavy Winds In Khammam District

పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో)పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో)

శనివారం సాయంత్రం సత్తుపల్లి ప్రాంతంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. భారీగా గాలులు వీచడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. కాగా, సత్తుపల్లి ప్రాంతంలోని మారుతి రెస్టారెంట్ సమీపంలో పార్కింగ్ చేసిన ఓ ప్రైవేటు బస్సు గాలి బీభత్సానికి వెనక్కి కొట్టుకుపోయింది.

Heavy winds forced a bus to move back in sathupalli in khammam district.

గాలులు బలంగా వీయడంతో సుమారు వంద మీటర్ల దూరం వరకు వెళ్లిన ఆ ప్రవేట్ బస్సు.. రోడ్డుకు అవతలవైపు ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. అయితే, బస్సు కొట్టుకుపోయిన సమయంలో ఆ బస్సులో డ్రైవర్ తోపాటు ప్రయాణికులు కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. సోమవారం కూడా తెలంగాణలోని కరీంనగర్ తోపాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

English summary
Heavy winds forced a bus to move back in sathupalli in khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X