• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కందాల వర్సెస్ తుమ్మల .. కారు పార్టీలో కుమ్ములాట

|

స్పష్టమైన మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది . ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేసింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా 2014 ఎన్నికల్లో టీడీపీ ని ఖాళీ చేసినట్లుగా, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చెయ్యాలని గెలిచిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానించి కార్ ఎక్కించుకున్నారు సీఎం కేసీఆర్. ఇక అక్కడే పితలాటకం మొదలైంది. ఫలితంగా ఖమ్మం జిల్లాలో గులాబీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయ్యింది.

ఖమ్మం కారులో ఆధిపత్య పోరు .. తుమ్మలకు తలనొప్పిగా మారిన కందాల

ఖమ్మం కారులో ఆధిపత్య పోరు .. తుమ్మలకు తలనొప్పిగా మారిన కందాల

ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కందాల వర్సెస్ తుమ్మల ఎపిసోడ్ ఖమ్మం పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది . మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు . ఓడిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వమని కేసీఆర్ చెప్పడంతో తుమ్మలకు ఆ పదవి దక్కకుండా పోయింది. గతంలో మంత్రిగా పని చేసిన తుమ్మల ఈసారి ఏదైనా నామినేటెడ్ పదవైనా వస్తుందని ఎదురుచూశారు . కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు . ఇక తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి సైతం గులాబీ గూటికి చేరారు. ఇక వలస వచ్చిన ఎమ్మెల్యే కందాల గులాబీ గూటికి చేరి అంతా తానై వ్యవహరిస్తుండటం తుమ్మలకు ఏ మాత్రం నచ్చటం లేదు .

తుమ్మలను పక్కన పెట్టి అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

తుమ్మలను పక్కన పెట్టి అన్నీ తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

కందాల వ్యవహార శైలి తుమ్మల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తుంది. కారులో సీనియర్ అయిన తుమ్మలనే పక్కనపెట్టేశాడు అన్న ఆసక్తికర చర్చ ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

మొన్నటి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తుమ్మల వర్గానికి టీఆర్ఎస్ నుండి టికెట్లే ఇవ్వలేదట.. దీనిపై తుమ్మల అధిష్టానానికి ఫిర్యాదు చేయగా ఇద్దరికీ సంధి కుదిర్చారని టాక్ ఉంది . ఇక వీరి మధ్య అధిష్టానం జోక్యం చేసుకోవటంతో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు.అయితే కందాల ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదులోనూ తుమ్మల వర్గాన్ని పక్కనపెట్టడంతో వివాదం ముదిరింది.

తీవ్ర అసహనంలో తుమ్మల వర్గం ... రాజకీయ భవిష్యత్ కోసం తుమ్మల నిర్ణయంపై ఆసక్తి

తీవ్ర అసహనంలో తుమ్మల వర్గం ... రాజకీయ భవిష్యత్ కోసం తుమ్మల నిర్ణయంపై ఆసక్తి

పార్టీలో తుమ్మల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారంతా సమావేశమయ్యారని సమాచారం . తుమ్మల నాగేశ్వరరావు సైతం కందాల ఉపేందర్ రెడ్డి జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నా అక్కడ నుండి తుమ్మలకు సహకారం అందటం లేదు. ఈకారణంగా తుమ్మల తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో తుమ్మల తన రాజకీయ భవిష్యత్ కోసం ఏలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి తుమ్మల ఎన్నికల్లో ఓటమి పాలు కావటం ఆయన మంత్రి పదవికే కాదు ఏకంగా ఆయన రాజకీయ మనుగడకే ఎసరు పెట్టిందని చెప్పాలి .

English summary
The Kandala vs. Tummala episode has now become a headache for the Khammam party lines in Khammam district. Tummala Nageswara Rao, who contested from Palaru, lost in the last Telangana Assembly elections. Congress MLA Upendar Reddy won over him. Upendar Reddy also joined in trs party . MLA Kandala is dealing with everything. Tummala Nageshwara Rao is also known as the supreme of khammam party . but kandala is dominating tummala in all party activities . so, tummala's political future is now in problem . this became a mess in the party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X