ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నవాడివైనా నీ మనసు పెద్దదయ్యా..! దివ్యాంగుడికి కేసీఆర్ మనవడి సాయం

|
Google Oneindia TeluguNews

భద్రాచలం : ఏదైనా చేయాలనుకుంటే వయసుతో నిమిత్తం లేదు. అది సాయమైనా, ఇంకేదైనా. సరిగ్గా అదే ప్రూవ్ చేశాడు కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు. వయసులో చిన్నవాడైనా పెద్దమనసు చాటుకున్నాడు. ఏళ్లకొద్దీ ఓ దివ్యాంగుడు పడుతున్న బాధకు చలించిపోయాడు. నిండు మనసుతో చేయూతనందించాడు.

భద్రాచలంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో నివసించే నూకసాని శ్రీనివాసరావు రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో దాదాపు 12 ఏళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. మొదట్లో మంచానికే పరిమితమైన శ్రీనివాసరావు రానురాను కొద్దిగా కోలుకుని ట్రై సైకిల్ వినియోగంతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఆరోగ్యం దెబ్బతినడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నడుం కింది భాగం దెబ్బతినడంతో పురుగులు పడి నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న హిమాన్షు చలించిపోయాడు. శ్రీనివాసరావు వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు తమకు తెలిసినవారిని పురమాయించాడు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అతడికి చికిత్స అందుతోంది.

kcr grand son, ktr son himanshu has a big heart as youngest in age.

ఇటీవల శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో హిమాన్షుకు కనిపించింది. దివ్యాంగుల పాలిట కేసీఆర్ దేవుడు.. ఇప్పుడిచ్చే పింఛను సరిపోతుంది.. 3వేలు ఇవ్వకున్నా సరే గానీ ఆయనే మళ్లీ సీఎం కావాలి అనేది ఆ వీడియో తాలూకు సారాంశం. ఇక్కడే హిమాన్షు హృదయం చలించి ఉంటుంది. తాతయ్య ప్రజాసేవ చేస్తున్నారనే విషయం అర్థమై ఉంటుంది. మొత్తానికి ఆ దివ్యాంగుడు ఎవరో, ఆయన పరిస్థితేంటో కనుక్కున్నారు. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలియడంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాడు.

హిమాన్షు చిన్నవాడైనా పెద్దమనసు ఉందంటున్నారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. హిమాన్షు తమతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. ఒకవేళ భద్రాచలంలో కాకుండా ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే తాతయ్య కేసీఆర్ తో మాట్లాడి హైదరాబాద్ కు తరలిస్తామని చెప్పాడట. దీంతో కుటుంబ సభ్యులు హిమాన్షుకు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
kcr grand son, ktr son himanshu has a big heart as youngest in age. He helped to handicapped person who suffering from years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X